NBFCs Licence: నిర్వహణ సరిగా లేని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సంస్థలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొరడా ఝులిపిస్తోంది. పెద్ద పెద్ద పీఎస్‌యూ బ్యాంకులకు సైతం భారీగా జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దివాలాకు సమీపంలో ఉన్న కొన్ని బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థల లైసెన్సులు సైతం రద్దు చేసిన సందర్భాలూ ఉన్నాయి. అయితే,ఈ కేంద్ర బ్యాంక్ తెలిపింది. లైసెన్సులు రద్దయిన ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల్లో అత్యధికంగా పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోనే ఉన్నట్లు తెలిపింది. ముఖ్యంగా కోల్‌కత్తా ప్రాంతంలో అత్యధికంగా ఉన్నాయని పేర్కొంది.'రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934లోని సెక్షన్ 45-IA (6) కింద దఖలు పడిన అధికారాలను ఉపయోగించి కేంద్ర బ్యాంకులు పలు కంపెనీల సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసింది.' అని ఆర్‌బీఐ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది. లైసెన్సులు రద్దయిన కంపెనీల్లో కొన్ని స్మాల్ అండ్ మీడియం సైజ్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీలు ఉన్నాయి. ఈ సంస్థలు రుణాలు ఇవ్వడం, లీజింగ్, పెట్టుబడుల వంటి ఆర్థిక కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని ఆర్‌బీఐ తెలిపింది. ఈ జాబితాలో తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, బిహార్, హరియాణా రాష్ట్రాల్లోని కంపెనీలు సైతం ఉన్నాయని వెల్లడించింది. లైసెన్స్ రద్దయిన కంపెనీలు ఆర్‌బీఐ చట్టం 1934లోని సెక్షన్ 45-Iలోని క్లాజ్ (ఎ)లో నిర్వచించిన విధంగా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ వ్యాపారాన్ని నిర్వహించకూడదని స్పష్టం చేసింది. ఇవి రుణాలు ఇవ్వడం, పెట్టుబడులు పెట్టడం సహా బ్యాంకుల మాదిరిగా ఇతర ఫైనాన్షియల్ సర్వీసులను అందిస్తుంటాయి. కానీ, వాటికి బ్యాంకింగ్ లైసెన్స్ ఉండదు. అయినప్పటికీ ఆర్‌బీఐ చట్టం ద్వారా రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలో ఉంటాయి. సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ రద్దు అంటే ఆయా కంపెనీలు ఇకపై ఎన్‌బీఎఫ్‌సీలుగా కార్యకలాపాలు నిర్వహించడం కుదరదు. సెంట్రల్ బ్యాంక్ నియంత్రణలో ఉండే ఎలాంటి ఫైనాన్షియల్ బిజినెస్ పనులు చేయకూడదు. రుణాలు ఇవ్వకూడదు. డిపాజిట్లు సేకరించి ఎలాంటి పెట్టుబడులు పెట్టేందుకు ఉండదు. ఎన్‌బీఎఫ్‌సీలు నిర్వహించే ఏ ఆర్థిక పరమైన వ్యాపార కార్యకలాపాలను నిర్వహించకూడదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.