బంగారం ఉత్పత్తికి కేరాఫ్ ఏపీ.. వచ్చే ఏడాది 1500 కిలోల ఉత్పత్తి.. చంద్రబాబు

Wait 5 sec.

బంగారం ఉత్పత్తికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిరునామాగా మారుస్తామని ఏపీ సీఎం నాయుడు అన్నారు. బంగారం అంటే ఒకప్పుడు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) గుర్తుకు వచ్చేదని.. ఇకపై) గుర్తుకువస్తుందన్నారు చంద్రబాబు. కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్‌లో బంగారం ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. జొన్నగిరి గోల్డ్ ప్లాంట్ ద్వారా ఈ ఏడాది 600 కేజీల బంగారం ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. వచ్చే ఏడాది 1500 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ అందుబాటులోకి వస్తే బంగారం ఉత్పత్తికి ఏపీ చిరునామాగా మారుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు శ్రీసత్యసాయి జిల్లా కార్యక్రమం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని అన్నారు. మరోవైపు పుట్టపర్తిలో రూ.15,803 కోట్లతో AMCA (అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) ప్రాజెక్టు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 7,500 మందికి ఉద్యోగావకాశాలు కలగనున్నాయి.మరోవైపు ఉంది. దేశంలోనే మొదటి ప్రైవేట్ బంగారు గనిగా దీనిని పేర్కొంటున్నారు. వాస్తవానికి మేలోనే దీనిని ప్రారంభించాల్సి ఉంది. అయితే కాస్త ఆలస్యం కావటంతో వచ్చే నెలలో దీనిని ప్రారంభించే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల జరిగిన ఓ సభలో ఈ విషయంపై ప్రకటన చేశారు. జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి అనే గ్రామాల పరిధిలో సుమారుగా 598 హెక్టార్లలో ఈ గోల్డ్ ఫీల్డ్ విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో టన్ను మట్టికి.. 1.5 నుంచి 2 గ్రాముల వరకూ బంగారం ఉత్పత్తి చేయవచ్చని అంచనా. ఈ నేపథ్యంలోనే జియోమైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఓ కంపెనీ ఈ ప్రాజెక్టు కోసం భారీగా పెట్టుబడి పెడుతోంది. ఈ గోల్డ్ ఫీల్డ్ నుంచి కేవలం బంగారం మైనింగ్ మాత్రమే కాకుండా.. జియోమైసూర్ పేరుతో నగల వ్యాపారులకే బంగారాన్ని అమ్మేందుకు సదరు సంస్థ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఈ గోల్డ్ ఫీల్డ్ ద్వారా ఏడాదికి 600 కిలోల బంగారం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.