‘ఎంజీఆర్’లా పాలించాలి.. సీఎం జోసెఫ్ విజయ్‌తో ఫోన్‌లో మాట్లాడిన చిరంజీవి

Wait 5 sec.

తమిళనాడు ముఖ్యమంత్రిగా కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే సంచలన నిర్ణయాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సినీ రంగం నుంచి సీఎం స్థాయికి ఎదిగిన విజయ్ కు సినీ ప్రముఖులందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా విజయ్‌ ను మెగాస్టార్ అభినందించారు.ఇటీవలే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్‌తో చిరంజీవి ఫోన్‌లో మాట్లాడారు. ఆయనకు అభినందనలు తెలిపారు. దివంగత నేత ఎంజీఆర్‌ తమిళ ప్రజల హృదయాల్లో ఎలాగైతే నిలిచిపోయారో, అలాగే విజయ్‌ కూడా ప్రజాకేంద్రీకృత పాలనతో ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆకాంక్షించారు. దానికి విజయ్ కూడా అంతే ఆప్యాయంగా స్పందిస్తూ, చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు.'జన నాయగన్' నిర్మాత కేవీఎన్ ప్రొడక్షన్స్ లో చిరు చేయబోయే 'మెగా 158' సినిమాకి విజయ్ తన బెస్ట్ విషెస్ తెలియజేశారు. అలానే ఇటీవల చిరంజీవి నటించిన 'మన శంకర వర ప్రసాద్ గారు' సినిమా చూశానని, ఆయన స్క్రీన్‌ ప్రెజెన్స్‌, కామెడీని ఎంతగానో ఆనందించానని దళపతి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి విజయ్, మెగాస్టార్ చిరంజీవిల మధ్య జరిగిన ఆత్మీయ ఫోన్ సంభాషణ ఇప్పుడు దక్షిణాది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి సంభాషణ తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమల మధ్య పాతుకుపోయిన స్నేహాన్ని, పరస్పర అభిమానాన్ని చాటుతోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. విజయ్ ఫ్యామిలీతో చిరంజీవికి మంచి సాన్నిహిత్యం ఉంది. చిరు కెరీర్ ప్రారంభంలో విజయ్ తండ్రి చంద్రశేఖర్ దర్శకత్వంలో కొన్ని సినిమాలు చేశారు.