GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్.. సీఎస్కేలో కీలక మార్పులు!

Wait 5 sec.

ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న గుజరాత్ టైటాన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచాడు. గుజరాత్ టైటాన్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన రుతురాజ్.. సీఎస్కేలో కీలక మార్పులు చోటుచేసుకున్నట్లు తెలిపాడు. అకేలా హోసెన్, ప్రశాంత్ వీర్‌ను పక్కనబెట్టి వాళ్ల స్థానంలో మాథ్యూ షార్ట్, గుర్‌జపనీత్ సింగ్‌ను ప్లేయింగ్ 11లో దింపనున్నట్లు తెలిపాడు.ఈ మ్యాచ్ ఇటు గుజరాత్.. అటు చెన్నైకి చాలా కీలకంగా మారింది. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకోవాలంటే సీఎస్కేకి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్.. దాంతో చావో రేవో అన్న రీతిలో ఆడటం తప్ప సీఎస్కేకి మరో అవకాశం లేదు. మరోవైపు క్వాలిఫైయర్ 1లో తన స్థానం ఫిక్స్ చేసుకోవాలంటే గుజరాత్ టైటాన్స్‌ ఈ మ్యాచ్‌లో గెలిచి తీరాల్సిందే. లీగ్ స్టేజ్‌లో ఇరు జట్లకు ఇదే చివరి మ్యాచ్ కావడంతో రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఒక మ్యాచ్‌లో తలపడ్డాయి. చెన్నై సూపర్ కింగ్స్ హోం గ్రౌండ్ చెపాక్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో సీఎస్కే ఓటమిపాలయింది. గుజరాత్ కూడా ఆ మ్యాచ్ నుంచే తన విజయపరంపర కొనసాగింది. దాంతో ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ను వాళ్ల హోం గ్రౌండ్‌లో ఓడించి రివేంజ్ తీర్చుకోవాలని సీఎస్కే చూస్తోంది. ఓవరాల్‌గా ఇరు జట్ల మధ్య తొమ్మిది మ్యాచ్‌లు జరిగితే గుజరాత్ ఐదు, సీఎస్కే నాలుగు మ్యాచ్‌లు గెలిచింది.పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ 12 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఇంకో రెండు పాయింట్లు సాధిస్తే ప్లే ఆఫ్స్ రేసులో నిలుస్తుంది. అయినా.. స్థానం ఖరారు చేసుకోవాలంటే రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, కోల్‌కతా మ్యాచ్‌ల మీద ఆధారపడాల్సి ఉంది. ఇక గుజరాత్ 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉండి ఇప్పటికే ప్లే ఆఫ్స్‌లో తన స్థానం ఖరారు చేసుకుంది. గుజరాత్ టైటాన్స్ జట్టుసాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్, నిశాంత్ సింధూ, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడా, సాయి కిశోర్, మొహమ్మద్ సిరాజ్చెన్నై సూపర్ కింగ్స్ జట్టుసంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), కార్తీక్ శర్మ, ఉర్విల్ పటేల్, డివాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, నూర్ అహ్మద్, మాథ్యూ షార్ట్, గుర్‌జపనీత్ సింగ్, అన్షుల్ కాంబోజ్, స్పెన్సార్ జాన్సన్, ముకేశ్ చౌదరి.