‘సీఎం కుర్చీలో కూర్చుంటే మైండ్ ఛేంజ్ అవుతుందేమో, పదే పదే పొగడాలేమో’.. బాలినేని సెటైర్లు

Wait 5 sec.

ఇటీవలే .. గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి పదవి కోరుకోవడం లేదని.. కేవలం మర్యాదపూర్వకంగానే ముఖ్యమంత్రిని కలిశానన్నారు. కూటమి నేతలతో కలిసి పని చేయాలని చంద్రబాబు తనకు సూచించారన్నారు. ఒకవేళ తాను పదవి కావాలని అడిగితే పవన్ కళ్యాణ్‌ను అడుగుతాను కానీ.. చంద్రబాబును ఎందుకు అడుగుతానని ప్రశ్నించారు. తాను చంద్రబాబును కలిసిన తర్వాత .వైఎస్ జగన్ మళ్లీ మావిగన్ ప్రస్తావన తీసుకురావడం పట్ల బాలినేని స్పందించారు. ‘వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. స్టార్టింగ్‌లోనే నాగార్జున యూనివర్సిటీ దగ్గర రాజధాని పెడదామని సీఎం గారికి చెప్పాను. ఇలా చేయడం వల్ల కొన్ని గ్రామాల ప్రజలే బాధపడతారు. కానీ గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలు కూడా సానుకూలంగా ఉంటారు. మీకు మంచిపేరు వస్తుందని చెప్పాను. కానీ ఆయన విశాఖపట్నంలోనే రాజధాని పెడతానని చెప్పారు. సజ్జలతోనూ పదే పదే ఈ విషయం చెప్పాను. ఇప్పుడు జగన్ అదే మాట చెబుతున్నారు. అప్పుడు అలా చేయకుండా మావిగన్ అనడం ఏంటి? రాజధానిలోకి మచిలీపట్నం ఎందుకు తీసుకురావాలి? గుంటూరు, విజయవాడ చాలదా? నేను ఈ సూచన చేశానో లేదో చెప్పమనండి. ఉన్నది ఉన్నట్టు చెబితే ఇష్టపడరు. నాకు ఒక అనుమానం.. సీఎం సీట్లో కూర్చొంటే మైండ్ ఛేంజ్ అయిపోతుందేమే ఎవరికైనా, పొగుడుతూ ఉండాలేమో’ అని బాలినేని వ్యాఖ్యానించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తున్నాయన్న బాలినేని.. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వచ్చిందన్నారు. ఇప్పుడు ఏం జరగలేదు అంటున్నారు కదా.. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో చెప్పండి.. బటన్ నొక్కే కార్యక్రమం తప్పితే ఏమైనా జరిగిందా అని ప్రశ్నించారు. డైవర్షన్ కోసమే జగన్ మావిగన్ ప్రస్తావన తెస్తున్నారన్నారు. ఈ పని అధికారంలో ఉన్నప్పుడే చేయాల్సింది కదా అన్నారు.చంద్రబాబును, పవన్ కళ్యాణ్‌ను పదవుల విషయంలో తానేమీ అడగలేదన్న బాలినేని.. ఎన్నికలు అయిపోయాక జనసేనలో చేరాను కాబట్టి.. . పని చేసి అడగాలి కానీ.. రాగానే పదవి కావాలని అడగటం కరెక్ట్ కాదన్నారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే ప్రచారం పట్ల బాలినేని స్పందిస్తూ.. చంద్రబాబును తానేం అడగలేదన్నారు.తన కుమారుడు వైసీపీలో ఉన్నప్పటి నుంచే రాజకీయాల్లో తిరుగుతున్నారన్న బాలినేని.. ఎలక్షన్ ముందు తన కుమారుడిపై టీడీపీ వాళ్లు రకరకాల ప్రచారాలు చేశారని.. అప్పుడు మే ఏం తప్పు చేసినా చర్యలు తీసుకోవాలని తాను చంద్రబాబుకు కూడా లేఖ రాశానన్నారు. అప్పుడు మేం ఏం చేయకపోయినా ప్రచారం చేశారు.. అప్పుడు మా మీద ఏం ప్రచారం చేశారో.. ఆ పనులు ఇప్పుడు చేస్తున్నారు అని బాలినేని ఆరోపించారు. స్థానిక సంస్థల్లో ఎవరు ఎక్కడ బలంగా ఉన్నారో తెలుసుకోవడం.. జనసేన పార్టీకి న్యాయం చేయడం కోసం ఇటీవల కమిటీలను వేశారన్నారు. తెలంగాణలో బీజేపీతో టీడీపీ, జనసేన కలిసి పని చేసే అంశం తన పరిధిలో లేదన్నారు.