ఎల్ఐసీకి కళ్లుచెదిరే లాభాలు.. ప్రీమియంలతోనే 3 నెలల్లో లక్షల కోట్ల ఆదాయం.. రూ. 10 డివిడెండ్ ప్రకటన

Wait 5 sec.

: భారత్‌కు చెందిన లిస్టెడ్ కంపెనీలు అన్నీ 2025-26 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం ఫలితాల్ని ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా ఎప్పటిలానే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫలితాలు వెల్లడించగా.. తర్వాత ఇతర ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ సంస్థలు కూడా విడుదల చేశాయి. ఇప్పుడు ప్రభుత్వ రంగానికి చెందిన అతిపెద్ద బీమా సంస్థ.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) జనవరి- మార్చి త్రైమాసికం ఫలితాల్ని మే 21న విడుదల చేసింది. 3 నెలల సమీక్షా త్రైమాసికంలో నికర లాభం రూ. 23,467 కోట్లుగా వచ్చింది. ఇది అంతకుముందు ఇదే సమయంతో పోలిస్తే ఏకంగా 23 శాతం అధికం కావడం విశేషం. . ఇక సమీక్షా త్రైమాసికంలో ఎల్ఐసీకి ప్రీమియంల ద్వారా నికర వసూళ్లు రికార్డు స్థాయిలో రూ. 1.65 లక్షల కోట్ల మేర ఆదాయం రావడం విశేషం. ఇది అంతకుముందు చూస్తే రూ. 1.47 లక్షల కోట్లుగానే ఉంది. ఇక్కడ ప్రీమియం ఆదాయం దాదాపు 10 శాతానికిపైగా పెరిగిందని చెప్పొచ్చు.ఎల్ఐసీ ఫలితాలు- హైలైట్స్ ఫస్ట్ ఇయర్ ప్రీమియం ఆదాయం రూ. 13,009 కోట్లుగా ఉండగా.. రెనివల్ ప్రీమియం ఇన్‌కం రూ. 82,233 కోట్లుగా నమోదైంది. ఇన్వెస్ట్‌మెంట్ల నుంచి ఆదాయం 17 శాతం పెరిగి రూ. 1.09 లక్షల కోట్లకు చేరుకుంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. ఎల్ఐసీ లాభం రూ. 57,453 కోట్లుగా వచ్చింది. నికర ప్రీమియం ఆదాయం 10 శాతం పెరిగి రూ. 5.38 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఎల్ఐసీ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ. 53.68 లక్షల కోట్లుగా ఉన్నాయి.ఎల్ఐసీ తుది డివిడెండ్ (LIC Final Dividend)ఇదే సమయంలో ఎల్ఐసీ.. తమ షేర్ హోల్డర్లకు మరో శుభవార్త చెప్పింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తుది డివిడెండ్ కూడా ప్రకటించింది. ఒక్కో ఈక్విటీ షేరుకు రూ. 10 చొప్పున డివిడెండ్ చెల్లించనున్నట్లు తెలిపింది. దీనికి రికార్డ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. ఆ డేట్ లోపు ఎల్ఐసీ షేర్లు కలిగి ఉన్న వారు.. డివిడెండ్ డబ్బులు పొందేందుకు అర్హులు అని చెప్పొచ్చు. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో మాత్రం డివిడెండ్ రూ. 12 చొప్పున చెల్లించింది.ఎల్ఐసీ షేరు (LIC Share Price)ఇక స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసిన తర్వాత ఎల్ఐసీ ఫలితాలు విడుదల కాగా.. షేరులో పెద్దగా మార్పు లేదు. మే 21న ఎల్ఐసీ స్టాక్ ధర స్వల్పంగా 0.43 శాతం పెరిగి రూ. 804 వద్ద స్థిరపడింది. మార్కెట్ విలువ రూ. 5.06 లక్షల కోట్లుగా ఉంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ. 980 కాగా.. కనిష్ఠ ధర రూ. 721.50 గా ఉంది.