లో భారీ అంచనాలతో అడుగుపెట్టిన .. ఫస్ట్ హాఫ్‌లో జీరోగా మిగిలి, సెకండ్ హాఫ్‌లో మాస్ కమ్ బ్యాక్ ఇచ్చింది. తొలి ఆరు మ్యాచ్‌లలో కనీసం ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవని కోల్‌కతా.. ఆ తర్వాత హ్యాట్రిక్ విక్టరీలతో ఆఖరి ఏడు మ్యాచ్‌లలో ఆరు విజయాలు సాధించింది. ఇప్పుడు ఏకంగా ప్లే ఆఫ్స్ రేసులో అడుగుపెట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఐపీఎల్ 2025 మినీ వేలంలో భారీ పర్సుతో మంచి మంచి ప్లేయర్లను కొనుగోలు చేసిన .. సీజన్‌లో మాత్రం దారుణంగా విఫలమైంది. ముంబై ఇండియన్స్‌తో మొదలైన ఓటమి గుజరాత్ టైటాన్స్ వరకూ కొనసాగింది. తొలి ఆరు మ్యాచ్‌లలో ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు. పంజాబ్‌తో మ్యాచ్ రద్దవడంతో లక్కీగా ఒక పాయింట్ దక్కింది. అయితే, విజయం కోసం ఎంతో స్ట్రగుల్ పడిన కేకేఆర్‌కు ఈ సీజన్‌లో తన ఏడో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై తొలి విజయం దక్కింది. అక్కడి నుంచి కేకేఆర్ వెనుదిరిగి చూసుకోలేదు. లక్నోతో జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో విజయం దక్కించుకుంది. సన్‌రైజర్స్‌ను వాళ్ల హోం గ్రౌండ్‌లోనే ఓడించి రివేంజ్ తీర్చుకుంది. ఢిల్లీని 8 వికెట్ల తేడాతో చిత్తు చిత్తు చేసింది. మధ్యలో ఆర్సీబీపై ఓడిపోయిన ఆర్సీబీ.. ఆ తర్వాత వెంటవెంటనే గుజరాత్, ముంబైపై గ్రాండ్ విక్టరీ సాధించింది. సీజన్ ఫస్ట్ హాఫ్‌లో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్.. ఇప్పుడు ఏకంగా ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం 13 మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరు విజయాలతో 13 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి ఎగబాకింది. కేకేఆర్ తన చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై భారీ విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్‌కు అవకాశం ఉంటుంది. అదే సమయంలో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తమ చివరి మ్యాచ్‌లలో ఓటమిపాలవ్వాలి. మరి కేకేఆర్‌కు అదృష్టం కలిసొస్తుందో లేదో వేచి చూడాలి మరి!