తమిళనాడు కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం.. విజయ్ టీంలో ఉన్నది వీరే..!

Wait 5 sec.

: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇటీవల అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తన మంత్రివర్గాన్ని భారీగా విస్తరించింది. కేబినెట్‌లోకి కొత్తగా 23 మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ ముఖ్యమంత్రి చేసిన సిఫార్సులకు తమిళనాడు గవర్నర్ అధికారికంగా ఆమోద ముద్ర వేశారు. చెన్నైలోని లోక్ భవన్ (రాజ్ భవన్) నుంచి విడుదలైన తాజా ప్రెస్ రిలీజ్ ప్రకారం.. టీవీకే సర్కారులో 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 21 మంది టీవీకే ఎమ్మెల్యేలు ఉన్నారు. మే 10వ తేదీన ముఖ్యమంత్రి విజయ్‌తో పాటు మరో తొమ్మిది మంది మంత్రులు మాత్రమే బాధ్యతలు స్వీకరించగా.. తాజా విస్తరణతో విజయ్ సర్కార్‌లోని మొత్తం మంత్రుల సంఖ్య 32కు చేరుకుంది.వివిధ ప్రాంతాలకు సమ ప్రాధాన్యత..రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు, సామాజిక వర్గాలకు సమతూకం పాటించినట్లు స్పష్టం అవుతోంది. ఉత్తర తమిళనాడు నుంచి దక్షిణ జిల్లాల వరకు, అలాగే పశ్చిమ కొంగునాడు ప్రాంతం నుంచి డెల్టా జిల్లాల వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల ప్రతినిధులకు కేబినెట్‌లో చోటు కల్పించారు. మంత్రివర్గంలో చేరబోతున్న నూతన మంత్రులు, వారి నియోజక వర్గాలు పూర్తి వివరాలివే..!శ్రీనాథ్ - తూత్తుకుడి అసెంబ్లీ నియోజకవర్గం (214)కమలి. ఎస్ – అవినాశి అసెంబ్లీ నియోజకవర్గం (112)సి. విజయలక్ష్మి – కుమారపాళయం అసెంబ్లీ నియోజకవర్గం (97)ఆర్.వి. రంజిత్‌కుమార్ – కాంచీపురం అసెంబ్లీ నియోజకవర్గం (37)వినోద్ – కుంభకోణం అసెంబ్లీ నియోజకవర్గం (171)రాజీవ్ – తిరువాడనై అసెంబ్లీ నియోజకవర్గం (210)బి. రాజ్‌కుమార్ – కడలూరు అసెంబ్లీ నియోజకవర్గం (155)వి. గాంధీరాజ్ – అరక్కోణం అసెంబ్లీ నియోజకవర్గం (38)మథన్ రాజా. పి – ఒట్టపిడారం అసెంబ్లీ నియోజకవర్గం (217)జగదీశ్వరి. కె – రాజపాళయం అసెంబ్లీ నియోజకవర్గం (202)రాజేష్ కుమార్. ఎస్ – కిలియూర్ అసెంబ్లీ నియోజకవర్గం (234)ఎం. విజయ్ బాలాజీ – ఈరోడ్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం (98)لوగేష్ తమిళ్‌సెల్వన్. డి – రాసిపురం అసెంబ్లీ నియోజకవర్గం (92)విజయ్ తమిళన్ పార్థిబన్. ఎ – సేలం సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం (90)రమేష్ – శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గం (139)పి. విశ్వనాథన్ – మేలూరు అసెంబ్లీ నియోజకవర్గం (188)కుమార్. ఆర్ – వేలచ్చేరి అసెంబ్లీ నియోజకవర్గం (26)తెన్నరసు. కె – శ్రీపెరంబుదూర్ అసెంబ్లీ నియోజకవర్గం (29)వి. సంపత్ కుమార్ – కోయంబత్తూర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం (118)మహ్మద్ ఫర్వాస్. జె – అరంతంగి అసెంబ్లీ నియోజకవర్గం (183)డి. శరత్‌కుమార్ – తాంబరం అసెంబ్లీ నియోజకవర్గం (31)ఎన్. మేరీ విల్సన్ – డాక్టర్ రాధాకృష్ణన్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం (11)విగ్నేష్. కె – కిణతుక్కడవు అసెంబ్లీ నియోజకవర్గం (122)పాలనలో వేగం పెంచేందుకే..గత నెలలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఘన .. మొదటి రోజు నుంచే ప్రజాకర్షక పాలనతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ భారీ కేబినెట్ విస్తరణ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును మరింత వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కొత్త రక్తాన్ని, అనుభవజ్ఞులను మేళవించి విజయ్ రూపకల్పన చేసిన ఈ సరికొత్త బృందం తమిళనాడు అభివృద్ధిలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.