Dividend Stocks: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్. మీరు డివిడెండ్ చెల్లించే స్టాక్స్ కోసం చూస్తుంటే ఇది మీకోసమే. అందులో ఎక్స్ డివిడెండ్ రికార్డ్ తేదీ మే 22, 2026గా ఉన్న కంపెనీలు ఉన్నాయి. అంటే మీరు మే 21వ తేదీ మార్కెట్ ముగిసేలోపు షేర్లు కొనుగోలు చేసినట్లయితేనే అర్హత లభిస్తుంది. ఎందుకంటే మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూల్స్ ప్రకారం T+1 సెటిల్మెంట్ రూల్ ఉంటుంది. అందుకే షేర్ హోల్డర్లు ఈరోజు షేర్లు కొంటేనే రేపటికి లెక్కలోకి వస్తుంది. మరి ఎల్ అండ్ టీ నుంచి హావెల్స్ వరకు ఏ కంపెనీలు డివిడెండ్ చెల్లిస్తున్నాయి, రికార్డ్ తేదీ ఎప్పుడు? అనే వివరాలు తెలుసుకుందాం. ఎల్ అండ్ టీ నుంచి 3 కంపెనీల డివిడెండ్లార్సెన్ అండ్ టర్బో కొద్ది రోజుల క్రితమే గత ఫైనాన్షియల్ ఇయర్ చివరి త్రైమాసికానికి గానూ తుది డివిడెండ్ ప్రకటించింది. రూ.2 ఫేస్ వాల్యూ ఉన్న ఒక్కో షేరుకు రూ.38 చొప్పున డివిడెండ్ చెల్లిస్తామని తెలిపింది. ఇందుకు మే 22, 2026ను రికార్డ్ తేదీగా నిర్ణయించింది. 2001, జూన్ నుంచి చూస్తే ఏకంగా 32 సార్లు డివిడెండ్ చెల్లించింది. మరోవైపు.. ఇదే గ్రూప్‌లని మరో రెండు కంపెనీలు డివిడెండ్ చెల్లిస్తున్నాయి. ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ ఫైనల్ డివిడెండ్ రూ.40 ఇస్తోంది. అలాగే ఎల్ అండ్ టీ ఫైనాన్స్ రూ.2.75 చొప్పున డివిడెండ్ ఇస్తోంది. వీటికి సైతం రికార్డ్ తేదీ మే 22గా నిర్ణయించారు. అంటే ఈలోపు ఈ 3 కంపెనీల షేర్లు కొన్నవారికే అర్హత లభిస్తుంది.హావెల్స్ ఇండియా డివిడెండ్హావెల్స్ ఇండియా ఫైనల్ డివిడెండ్ ఒక్కో షేరుకు రూ.6 చొప్పున డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది. రికార్డ్ తేదీ మే 24, 2026 ఆదివారంగా తెలిపింది. అంటే ఈ షేర్లు కొనేందుకు సైతం ఈరోజే ఆఖరు. ఇవాళ కొంటేనే డివిడెండ్ వస్తుంది. 2000 నుంచి చూసుకుంటే ఈ కంపెనీ ఇప్పటి వరకు 37 సార్లు డివిడెండ్ ఇచ్చింది. ఈరోజు మార్కెట్లు ముగిసే లోపు కొన్న వారికే అర్హత ఉంటుంది. సులా వైన్‌యార్డ్స్ డివిడెండ్సులా వైన్ యార్డ్స్ లిమిడెట్ కంపెనీ కొద్ది రోజుల క్రితమే ఒక్కో షేరుకు రూ.2 చొప్పున ఫైనల్ డివిడెండ్ చెల్లించనున్నట్లు తెలిపింది. ఫైస్ వాల్యూ రూ.2 ఉన్న షేరుకు 100 శాతం డివిడెండ్ ఇస్తోంది. వీటి రికార్డ్ తేదీ సైతం మే 22న ఉండడంతో ఈరోజు మార్కెట్లు ముగిసే నాటికి షేర్లు కొన్నవారికే అర్హత ఉంటుంది. వైన్ మేకర్ గతేడాది రూ.3.6, రూ.4.5, రూ.4 చొప్పున డివిడెండ్ ఇచ్చింది. 2023లో రూ.5.25 చొప్పున చెల్లించింది.జిందాల్ సా డివిడెండ్జిందాల్ గ్రూప్‌లోని ప్రముఖ కంపెనీల్లో ఒకటైన జిందాల్ సా రూ.1 ఫేస్ వాల్యూ ఉన్న షేర్లకు రూ.2 చొప్పున ఫైనల్ డివిడెండ్ చెల్లిస్తామని తెలిపింది. ఇందుకు రికార్డ్ తేదీని మే 22,2026గా నిర్ణయించింది. దీంతో ఈరోజు మే 21న మార్కెట్లు ముగిసే లోపు కొన్నవారికే అర్హత ఉంటుంది. 2000 డిసెంబర్ నుంచి చూస్తే 26 సార్లు ఈ కంపెనీ డివిడెండ్ ఇచ్చింది. ఇతర కంపెనీల విషయానికి వస్తే హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ ఒక్కో షేరుకు రూ.0.8 చొప్పున డివిడెండ్ ఇస్తోంది. అలాగే జుపిటర్ లైఫ్ లైన్ హాస్పిటల్స్ రూ.1 చొప్పున డివిడెండ్ ఇస్తోంది. నిక్కో పార్క్స్ అండ్ రిసార్ట్స్ రూ.0.25 చొప్పున డివిడెండ్ ఇస్తోంది. వినైల్ కెమికల్స్ కంపెనీ ఒక్కో షేరుకు రూ.7 చొప్పున డివిడెండ్ ఇస్తోంది. వర్క్ మేట్స్ కోర్ 2 క్లౌడ్ సొల్యూషన్ రూ.2 చొప్పున డివిడెండ్ చెల్లిస్తోంది.