పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, ఈ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి గెలిచిన సువేందు.. భవానీపూర్ ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. నందిగ్రామ్ సీటుకు శుక్రవారం ఆయన రాజీనామా చేశారు. ఈ మేరకు నందిగ్రామ్ ఎమ్మెల్యేగా తన రాజీనామా లేఖను స్పీకర్ రతీంద్ర బోస్‌కు ముఖ్యమంత్రి శుక్రవారం అందజేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండు స్థానాల నుంచి విజయం సాధించినప్పటికీ ఒక సీటులో మాత్రమే కొనసాగాలి. మరో స్థానాన్ని రెండు వారాలలోపు వదులుకోవాల్సి ఉంటుంది. నందిగ్రామ్, భవానీపూర్ నుంచి సువేందు పోటీ చేశారు.నందిగ్రామ్‌లో టీఎంసీ అభ్యర్థి, తన మాజీ సన్నిహితుడిపై సువేందు 9,655 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక, భవానీపూర్‌లో టీఎంసీ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీని 15,105 ఓట్ల తేడాతో ఓడించారు. 2021 ఎన్నికల్లోనూ మమతాపై సువేందు అధికారి గెలుపొందారు. నందిగ్రామ్‌లో దాదాపు 2 వేల ఓట్లతో దీదీ ఓటమిపాలయ్యారు. చేసిన తర్వాత సువేందు మాట్లాడుతూ.. భవానీపూర్ ఎమ్మెల్యేగా తాను ప్రమాణస్వీకారం చేశానని అన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనల ప్రకారం ఒక సీటును వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు. అయితే, నందిగ్రామ్‌లో అభివృద్ధి కొనసాగుతుందని, నియోజకవర్గ ప్రజలకు తాను దూరమయ్యాయని భావించొద్దని అన్నారు. ఫిరోజా బీబీ సమయం నుంచి కూడా తాను నియోజకవర్గం కోసం కృషిచేస్తున్నట్టు చెప్పారు. ఈ స్థానానికి ఆరు నెలల్లో ఉప-ఎన్నిక జరగుతుంది. అక్కడ నుంచి బీజేపీ తరఫున సంజీవ్ సన్యాల్ పోటీచేసే అవకాశం ఉంది. బెంగాల్ ఆర్థిక మంత్రిగా ఆయననే నియమిస్తారని ప్రచారం జరుగుతోంది.