'వీరభద్రుడు' మూవీ రివ్యూ - సూర్యని గెస్ట్ రోల్‌లా చేసిన ఆర్జే బాలాజీ

Wait 5 sec.

కరోనా టైంలో సూర్య ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ అంటూ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయ్యారు. కానీ ఆ తరువాత సూర్య నటించిన ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించలేదు. ఎన్ని ప్రయోగాలు మార్చినా, జానర్స్ మార్చినా ఫలితం మాత్రం ఆశించినట్టుగా రాలేదు. ఇక ఇప్పుడు ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీకి చివరి నిమిషంలో ఆర్థిక కష్టాలు వచ్చాయి. అందుకే మే 14న రావాల్సిన ఈ సినిమా మే 15న వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ఆడియెన్స్‌కి ఏ మేరకు నచ్చుతుంది? అన్నది చూద్దాం.కథమునుస్వామి (ఇంద్రాన్స్) తన కూతురు మీను ఆపరేషన్ కోసం తమిళనాడు నుంచి హైదరాబాద్‌కు వస్తాడు. వచ్చీ రాగానే అతని వద్ద 60 సవర్ల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్తారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తే 45 సవర్లే వచ్చాయని చెబుతారు. వాటిని కోర్టులో తీసుకోవాలని చెబుతారు. దీంతో నాంపల్లి కోర్టులో ఉండే ఫేమస్ లాయస్ బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ)ని కలుస్తారు. అతనేమో డబ్బుల కోసం న్యాయాన్ని అమ్మేస్తుంటాడు. తన వద్దకు వచ్చిన వారిని జడ్జ్ రాజ నాయకన్ సాయంతో వాయిదాల మీద వాయిదాలు అంటూ కోర్టు చుట్టూ తిప్పి తిప్పి డబ్బులు వసూల్ చేస్తుంటాడు. అలాంటి వాడి చేతిలో చిక్కిన మునుస్వామి చివరకు విసిగి పోతాడు. అంతా దేవుడి మీదే భారం అని వీరభద్రుడు సాయం కోరతాడు. దీంతో వీరభద్రుడు (సూర్య) రంగంలోకి దిగుతాడు. అయితే బేబీ కృష్ణ మాత్రం ఇక్కడ ఇలానే ఉంటుంది.. ఇదే చట్టం, న్యాయం, ఇదే ప్రాసెస్ అని అంటాడు. నీకు చేతనైతే వచ్చి ఈ సిస్టమ్‌ను మార్చు అని దేవుడికే సవాల్ విసురుతాడు. సాధారణ మనిషిలా పోరాడాలి.. పవర్స్ వాడకూడదు అని కండీషన్ పెడతాడు. దీంతో లాయర్ సూర్యగా ఆ వీరభద్రుడు వస్తాడు. సాధారణ వ్యక్తిగా, లాయర్‌గా కేసుని వాదిస్తుంటాడు. అంతలోనే ఆపరేషన్ లేట్ అవ్వడంతో మునుస్వామి కూతురు చనిపోతుంది. వారికి న్యాయం చేయలేకపోయాను అని వీరభద్రుడు అనుకుంటాడు. దీంతో బేబీ కృష్ణ తను ఎంచుకున్న మార్గమే రైట్ అని వీరభద్రుడితో అంటాడు. ఆ తరువాత వీరభద్రుడు ఏ దారి ఎంచుకుంటాడు? కోర్టులో అబద్దాలు చెప్పి న్యాయాన్ని అమ్మేస్తున్న లాయర్లను ఏం చేస్తాడు? అందరికీ న్యాయం చేసేందుకు వీరభద్రుడు చేసిన మాయ ఏంటి? ఈ కథలో లాయర్ ప్రీతి (త్రిష) పాత్ర ఏంటి? చివరకు బేబీ కృష్ణ కథ ఎలా ముగుస్తుంది? అన్నది తెరపై చూడాల్సిందే.ప్రస్తుతం ఉన్న సమాజం, సిస్టంని చూస్తే.. అందరికీ ఏదో ఒక టైంలో.. ఆ దేవుడు దిగి వచ్చినా ఈ మనుషుల్ని, సమాజాన్ని మార్చలేడు అని అనుకునే ఉంటారు. సరిగ్గా ఆ పాయింట్‌తోనే ఈ కథను అల్లినట్టుగా అనిపిస్తుంది. ఆ దేవుడే సాధారణ వ్యక్తిలా వస్తే ఇక్కడ ఒక్క వ్యక్తిని కూడా మార్చలేం, మంచిదారిలో పెట్టలేం, ఈ సిస్టమ్‌ను మార్చలేం అని చూపించాడు. దేవుడు అనే సూపర్ పవర్ భూమ్మీదకు రావడం అనే కాన్సెప్ట్ కొత్తేమీ కాదు. ఇప్పటికీ కొన్ని వందల చిత్రాలు వచ్చాయి.ఆర్జే బాలాజీ సైతం ఇది వరకే ఇదే కాన్సెప్ట్‌తో నయనతారతో మూకుత్తి అమ్మన్ సినిమాని తీశాడు. ఇక ఇప్పుడు వీరభద్రుడు కూడా అదే కాన్సెప్ట్. అయితే ఈ సారి తన కాన్సెప్ట్‌కి కోర్ట్ బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నాడు ఆర్జే బాలాజీ. మామూలుగానే కోర్ట్ డ్రామాలు ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. కోర్టులో జరిగే ప్రొసీజర్ ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఈ సినిమాలోనూ ఫస్ట్ హాఫ్ అంతా కోర్ట్ డ్రామాగానే సాగుతుంది. ఫస్ట్ సీన్‌తోనే సినిమాలోకి లీనమయ్యేలా చేస్తాడు దర్శకుడు. ఆ దొంగలు దొరుకుతారా? నగలు చేతికి వస్తాయా? అమ్మాయికి ఆపరేషన్ జరుగుతుందా? లాయర్ ఆటను వీరభద్రుడు ఎలా కట్టిస్తాడు? అనే ఇంట్రెస్టింగ్ పాయింట్లతో అలా ఇంటర్వెల్ వరకు బాగానే సాగుతుంది.సెకండాఫ్‌ ఎలా ఉంటుందో అని అనుకునే ప్రేక్షకులకు కాస్త నిరాశే ఎదురువుతుంది. ఇక సూపర్ పవర్, దేవుడు విశ్వరూపం చూపిస్తాడేమో.. ఆట రసవత్తరంగా ఉంటుందేమో అని అంతా అనుకుంటారేమో. కానీ సరిహద్దు, క్షేత్రపాలకుడు అని కాన్సెప్ట్ పెట్టి.. ఒక ప్రాంతం వరకే పవర్స్ఉంటాయని చెప్పడం, కోర్టుని వేరే ప్లేస్‌కి మార్చడం వంటి సీన్లతో సినిమా ఎటెటో పోతోన్న ఫీలింగ్ వస్తుంది. దేవుడే కదా.. అలా ఎందుకు చేయలేడు.. ఇలా ఎందుకు చేయలేడు.. వాడ్ని ముందే ఎందుకు అంతం చేయడం లేదు.. అనే ప్రశ్నలు ప్రేక్షకులకు వస్తాయి.ఇక క్లైమాక్స్‌లో సూర్య విధ్వంసం సృష్టించాడని చెప్పుకోవచ్చు. ఇక ఎండింగ్ చూస్తుంటే రెండో పార్ట్‌కి కూడా ప్లాన్ చేసినట్టుగా ఉన్నాడు. ఈ సారి కోర్టుల చుట్టూ దేవుడు తిరిగాడు.. నెక్ట్స్ పాలిటిక్స్‌లోకి వచ్చి అసెంబ్లీ చుట్టూ తిరిగేలా ఉన్నాడు. టెక్నికల్‌గా ఈ మూవీని చూసుకుంటే విజువల్స్ బాగుంటాయి. సాయి అభ్యంకర్ కొట్టిన కొట్టుడికి ఒక్క పాట, అందులోని సాహిత్యం కూడా సరిగ్గా వినిపించలేదు. ఫైట్స్ బాగున్నాయి. కోర్టుకి వెళ్తే శిక్ష పడటం కాదు.. కోర్టుకి వెళ్లడమే శిక్ష అనే డైలాగ్ మాత్రం సూటిగా ప్రేక్షకుల హృదయాల్ని తాకుతుంది. ఎడిటింగ్, ఆర్ట్ ఇలా అన్ని డిపార్ట్మెంట్‌ల పని తీరు బాగుంది. నిర్మాణ పరంగా ఈ చిత్రం ఉన్నత స్థాయిలోనే కనిపిస్తుంది.నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో సూర్య గెస్ట్ రోల్‌లా కనిపిస్తుంది. సూర్యకి స్క్రీన్ స్పేస్ తక్కువ. ఉన్నంతలో సూర్య అదరగొట్టేశాడు. కాకపోతే ఈ సారి డబ్బింగ్ మాత్రం తేడా కొట్టేసింది. త్రిషకి ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్‌లోనే కాస్త ఎక్కువ సీన్లు పడ్డట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమాలో ఆర్జే బాలాజీ ఎక్కువ సేపు కనిపిస్తాడు. ఇది సూర్య కోసం కాకుండా తన కోసమే రాసుకుని, తన కోసమే తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. మిగిలిన పాత్రల్లో జార్జ్ మరియన్, ఇంద్రాన్స్, నటరాజన్, స్వసిక, మన్సూర్ అలీ ఖాన్ ఇలా అందరూ తమ పరిధి మేరకు నటించారు.ఓవరాల్‌గా ఆర్జే బాలాజీ కాకుండా ఈ చిత్రంలో సూర్య ఎక్కువ సేపు కనిపించి ఉంటే బాగుండేది. ఆర్జే బాలాజీ కేవలం దర్శకుడిగా ఈ మూవీని తీసి ఉంటే.. సెకండాఫ్ మీద మరింత ఫోకస్ పెట్టి ఉంటే ఫలితం మరింత అద్భుతంగా వచ్చే అవకాశం ఉండేదనిపిస్తుంది.