సీఎం విజయ్ నా కాళ్లపై పడ్డారు.. కరూర్ తొక్కిసలాటలో కుమార్తెను కోల్పోయిన మహిళ

Wait 5 sec.

తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) అనూహ్య విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ పాలనలో తనదైన ముద్రవేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రార్థనా స్థలాలు, విద్యా సంస్థలు, బస్టాండ్ల సమీపంలో ఉండే మద్యం దుకాణాలు మూసివేత, 21 ఏళ్ల నిండినవారికే మద్యం అమ్మకాలు వంటి ఆదేశాలు జారీచేశారు. అలాగే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 58 నుంచి 60 శాతానికి పెంచారు. ఇదే సమయంలో ఆయన వివాదాల్లోనూ చిక్కుకుంటున్నారు. ప్రమాణస్వీకారం రోజున తమిళ రాష్ట్రగీతానికి అవమానం, తన వ్యక్తిగత జ్యోతిషుడ్ని ముఖ్యమంత్రిగా ఓఎస్డీగా నియమించి విమర్శలను ఎదుర్కొన్నారు. దుమారం రేగడంతో ఆ నియామకాన్ని రద్దు చేశారు. అయితే, విజయ్ గతేడాది సెప్టెంబరులో కరూర్ ప్రాంతంలో విజయ్ ర్యాలీలో తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది ప్రాణాలు కోల్పోగా... పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటన విజయ్‌ను ఆత్మరక్షణలో పడేయగా.. ఆయన తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలను మహాబలిపురంలో రిసార్ట్‌కు రప్పించి, వారిని పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. తొక్కిసలాటలో కుమార్తెను కోల్పోయిన ఓ మహిళ ఇంటికి వెళ్లి విజయ్ పరామర్శించారు. ఈ సమయంలో దుఃఖాన్ని చూసి విజయ్ తట్టుకోలేకపోయారు. ఆయన కూడా కన్నీటి పర్యంతమై.. ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణలు కోరారు. ఈ సంఘటన గురించి తాజాగా బాధిత మహిళ బీబీసీతో పంచుకున్నారు. “తొక్కిసలాట ఘటన తర్వాత మమ్మల్ని పరామర్శించిన విజయ్ మాకు ధైర్యం చెప్పారు.. అండగా ఉంటానని హామీ ఇచ్చారు.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.. మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని మార్చేస్తామని ఆయన మాటిచ్చారు.. విజయ్ మాట మీద మాకు నమ్మకం ఉంది.. కాబట్టే ఆయనకు మేము ఓటు వేసి గెలిపించాం.. ఆయన చెప్పిన మార్పు గనుక మాకు కనిపిస్తే కచ్చితంగా సంతోషిస్తాం’’ బాలిక తల్లి పేర్కొంది.గతేడాది యావత్తు దేశాన్ని కలచివేసింది. విజయ్ రాక ఆలస్యం, ప్రాంగణం చిన్నది కావడంతో జనం కిక్కిరిసిపోయారు. ఇది చివరకు తొక్కిసలాటకు దారితీసింది. ఆ దుర్ఘటనలో ఊపిరిఆడక 41 మంది చనిపోయారు. వారిలో మహిళలు, చిన్నారులు సహా అన్ని వయసుల వారూ ఉన్నారు. బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి పరామర్శిస్తే.. మరింత గందరగోళం ఏర్పడతుందనే ఉద్దేశంతో విజయ్ మహాబలిపురం రిసార్టులో వారిని కలుసుకుని, పరామర్శించారు.