పోక్సో కేసులో నా పేరు, ఫోటో వాడొద్దు.. సిటీ సివిల్ కోర్టుకు బండి సంజయ్, కోర్టు ఏమందంటే?

Wait 5 sec.

కేంద్ర హోం శాఖ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్‌ కుమార్.. హైదరాబాద్ సిటీ సివిల్‌ కోర్టులో ఒక పిటిషన్ వేశారు. పిటిషన్‌ దాఖలు చేశారు. ఇప్పటి వరకు వార్తలు, వీడియోల్లో వాడిన తన పేరును, ఫోటోలను, వీడియోలను తీసివేసేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సిటీ సివిల్ కోర్టు.. పోక్సో కేసులో ఫొటోలు, వీడియోలను వాడొద్దని తేల్చి చెప్పింది. తన కొడుకు బండి భగీరథ్ కేసులో కేంద్రమంత్రి బండి సంజయ్ ఫొటోలు, వీడియోలు వాడొద్దని సిటీ సివిల్ కోర్డు ఆదేశాలు జారీ చేసింది. బండి భగీరథ్ కేసులో తన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్లలో వాడుతూ తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని వెంటనే ఫొటోలు, వీడియోలను తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు బండి సంజయ్. విచారణ చేపట్టిన కోర్టు.. ఈ కేసులో బండి సంజయ్ ఫొటోలు, వీడియోలు వాడొద్దని.. అలా ఉపయోగిస్తే మీడియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తన కొడుకు బండి భగీరథ్ కేసులో తన పేరు, ఫొటోలు, వీడియోలు.. మీడియా, సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని.. అయితే ఇక నుంచి వాటిని ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రమంత్రిగా ఉన్న తన ప్రతిష్ఠకు.. ఈ కేసులో భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు తన పేరుతో మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లలో ప్రచారం చేసిన వీడియోలను తొలగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణ చేసిన సిటీ సివిల్ కోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది. బండి భగీరథ్ పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ పేరును వాడొద్దంటూ గ్యాగ్ ఆర్డర్ జారీ చేసింది. బండి భగీరథ్ కేసులో ఎక్కడా బండి సంజయ్ పేరును గానీ, ఫోటోలను గానీ వినియోగించరాదని తేల్చి చెప్పింది. ఇప్పటివరకు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వీడియోలను కూడా డిలీట్ చేయాలని.. అలా చేయకుంటే అలాంటి మీడియా సంస్థలు, సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు.. ఈ కేసులో బాధితురాలి ఫోటోలు, వివరాలు వైరల్ చేయడంపైనా పోలీసులు తీవ్ర హెచ్చరికలు చేశారు.