గిల్, సుదర్శన్ విధ్వంసం.. అహ్మదాబాద్‌లో సీఎస్కే బౌలర్లకు చుక్కలు!

Wait 5 sec.

ఐపీఎల్ 2026 ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ రెచ్చిపోయింది. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్లు విధ్వంసం సృష్టించారు. కెప్టెన్ , బౌండరీలతో విరుచుకుపడ్డారు. 23 బంతుల్లోనే గిల్ హాఫ్ సెంచరీ చేయగా.. సాయి సుదర్శన్ ఈ సీజన్‌లో వరుసగా ఐదో హాఫ్ సెంచరీ నమోదు చేశారు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో.. గుజరాత్ టైటాన్స్ భారీ స్కోర్ చేయగలిగింది. డూ ఆర్ డై మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, సీఎస్కే బౌలర్లు ఆ స్థాయిలో రాణించకపోవడంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. గుజరాత్ ఓపెనర్లు మరోసారి ఈ సీజన్‌లో మంచి ఆరంభం ఇచ్చారు. శుభ్‌మన్ గిల్ - సాయి సుదర్శన్ పవర్ ప్లేలో 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పవర్ ప్లే తర్వాత గిల్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గిల్.. 37 బంతుల్లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 64 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇక మరో ఓపెనర్ సాయి సుదర్శన్ మాత్రం నిలకడగా ఆడుతూ ఈ సీజన్‌లో వరుసగా ఐదో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్ బౌండరీల మోత మోగించాడు. ఈ మ్యాచ్‌లో స్పిన్, పేస్ అన్న తేడా లేకుండా అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా నూర్ అహ్మద్ బౌలింగ్‌లో గుజరాత్ బ్యాటర్లు రిపీటెడ్ షాట్స్‌తో సేమ్ సిక్సర్లు బాదడం విశేషం. సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత బౌండరీలు బాదేశాడు. సెంచరీకి చేరువైన సమయంలో 53 బంతుల్లో ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 84 పరుగులు చేసి అవుటయ్యాడు. జోస్ బట్లర్ ఆఖర్లో హాఫ్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. బట్లర్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది.