మంత్రులకు శాఖలను కేటాయించిన విజయ్.. అత్యంత కీలకమైన ఆ రెండు శాఖలూ సీఎం దగ్గరే

Wait 5 sec.

తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి జోసెఫ్ విజయ్ తన మంత్రులకు శనివారం శాఖలను కేటాయించారు. కీలకమైన హోం, స్త్రీ-శిశు సంక్షేమ, పురపాలక, యువజన సంక్షేమం వంటి శాఖలను తన వద్దే విజయ్ అట్టిపెట్టుకున్నారు. సీనియర్ ఎమ్మెల్యే కేఏ సెంగొట్టైయన్‌కు ఆర్థిక శాఖతో పాటు పెన్షన్లు, పెన్షన్ భత్యాల బాధ్యతలను అప్పగించారు. క్యాబినెట్‌లో ఏకైక మహిళ మంత్రి సెల్వి ఎస్ కీర్తనకు పరిశ్రమల శాఖను విజయ్ కేటాయించారు. అత్యంత కీలకమైన శాఖకు మహిళకు అప్పగించడం తమిళ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.గ్రామీణాభివృద్ధి, జల వనరుల శాఖను ఎన్ ఆనంద్‌కు అప్పగించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీ, పేదరిక నిర్మూలన పథకాలు, గ్రామీణ రుణభారం, చిన్న నీటిపారుదల సహా సాగునీటి ప్రాజెక్టులు ఈ పరిధిలో ఉంటాయి. ఆర్ అండ్ బీ, ప్రజా పనులు, క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా అదవ్ అర్జున నియమితులయ్యారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖను డాక్టర్ కేజీ అరుణ్‌రాజ్‌‌కు, ఆహార, పౌర సరఫరాల శాఖను వెంకటరమణన్‌కు కేటాయించారు. దీంతో పాటు వినియోగదారుల రక్షణ, ధరల నియంత్రణ శాఖల బాధ్యతలను ఆయనకే కట్టబెట్టారు.ఇంధన వనరులు, న్యాయ శాఖలను ఆర్ నిర్మల్ కుమార్‌కు అప్పగించారు. విద్యుత్, సాంప్రదాయేతర ఇంధన వృద్ధి, అవినీతి నిరోధక శాఖ, శాసనసభ, గవర్నర్, ఎన్నికలు, పాస్‌పోర్ట్ విభాగాలు ఆయన పరిధిలోకి వస్తాయి. పాఠశాల విద్య, తమిళం అభివృద్ధి, సమాచార-ప్రచార శాఖలను రాజ్‌మోహన్‌కు కేటాయించారు. పురావస్తు శాఖ, సినీ సాంకేతికత, సినిమాటోగ్రఫీ చట్టం, న్యూస్‌ప్రింట్ నియంత్రణ, స్టేషనరీ-ముద్రణ ఆయన పరిధిలోనే ఉంటాయి. సహజ వనరులు (గనులు భూగర్భ శాఖ) శాఖలను డాక్టర్ టీకే ప్రభుకు అప్పగించారు.