తమిళనాడుతో పోలిస్తే ఏపీలో రూ.10 ఎక్కువ.. సిగ్గుపడాలి: వైఎస్ షర్మిల

Wait 5 sec.

పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక తాజాగా పెంపుతో ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.62 పైసలకు చేరుకుంది. దీంతోఆంధ్రప్రదేశ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పెట్రోల్ రేట్ల పెంపుపై ఏపీసీసీ చీఫ్ మండిపడ్డారు. అడ్వాన్స్‌డ్ ఆంధ్రప్రదేశ్ అంటే.. అత్యధిక ఇంధన ధరలు ఉండటమా అని షర్మిల ప్రశ్నించారు. వ్యాట్ పేరుతో జనాలను బాదుతున్నారంటూ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. " అత్యధిక ఇంధనం ధరలు ఏపీలో ఉండటమా అడ్వాన్స్డ్ ఆంధ్రప్రదేశ్ అంటే ? వ్యాట్ పేరుతో జనాలను బాదడమా దేశానికి ఏపీ రోల్ మోడల్? సెస్‌ల పేరుతో జనాల పర్సులు ఖాళీ చేయడమా విజన్ ఆంధ్రప్రదేశ్ ? పొదుపు మంత్రం సరే.. మరి వ్యాట్ దోపిడీ సంగతేంటి చంద్రబాబుగారు ? సైకిళ్ళు, ఈ - వెహికల్లు ఒకే.. మరి లీటర్ ధర మీద అదనంగా రూ.4 గుంజడంపై నియంత్రణ లేదా ? పొదుపు చర్యలు ప్రజలకేనా.. పన్నులు తగ్గించడంలో ప్రభుత్వానికి భాద్యత లేదా ? అభివృద్ధిలో చివరిస్థానం, ఇంధనం ధరల్లో మొదటి స్థానం ఉన్నందుకు సిగ్గుపడాలి. " అంటూ షర్మిల ట్వీట్ చేశారు. మరోవైపు తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 97.77 పైసలుగా ఉందన్నారు షర్మిల. ఢిల్లీని తలదన్నే అమరావతిలో లీటర్ పెట్రోల్ ధర 113. 62 పైసలుగా ఉందని వెల్లడించారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో లీటర్ డీజిల్ ధర రూ . 93.75 పైసలుగా ఉంటే.. ఏపీలో డీజిల్ ధర రూ 101.24 పైసలుగా ఉందని విమర్శించారు. పక్కరాష్ట్రం తమిళనాడుతో పోల్చినా రూ. 10 రూపాయలు అదనంగా ఉందని మండిపడ్డారు. కర్ణాటకతో రూ . 7, తెలంగాణ, కేరళతో చూసినా రూ. 4 రూపాయలు అధికంగా ఉన్నాయన్నారు.అధిక వ్యాట్, అదనపు వ్యాట్ పేరుతో ఏటా ప్రజలపై 10 వేల కోట్ల మేరకు భారం పడుతోందని.. ఆదాయం పెంపు మార్గాలంటూ టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ప్రజల నుంచి ముక్కుపిండి ఈ డబ్బులు వసూలు చేయడం దుర్మార్గపు చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్‌పై వసూలు చేస్తున్న 31 శాతం అధిక వ్యాట్‌ను సీఎం చంద్రబాబు వెంటనే తగ్గించాలని షర్మిల డిమాండ్ చేశారు. కర్ణాటకలో సేల్స్ టాక్స్ గరిష్టంగా 29 శాతంగా ఉందని.. తమిళనాడులో వ్యాట్ 13 శాతమేనని షర్మిల గుర్తు చేశారు. తెలంగాణలో 35 శాతం వ్యాట్ విధిస్తున్నప్పటికీ .. అదనపు వ్యాట్ 4 రూపాయల చార్జీల అక్కడి ప్రజలపై లేదన్నారు షర్మిల. ఆంధ్రప్రదేశ్ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఇంధనంపై వ్యాట్‌ను తగ్గించి, అదనంగా వసూలు చేస్తున్న రూ.4, రోడ్డు సెస్ పేరుతో దోపిడీ చేస్తున్న రూపాయి కలిపి , మొత్తంగా లీటర్ ధరపై 5 రూపాయలు అయినా ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని షర్మిల డిమాండ్ చేశారు.