నిమ్స్ ఆస్పత్రిపై తప్పుడు ప్రచారం.. నమ్మొద్దు: డైరెక్టర్ విజ్ఞప్తి

Wait 5 sec.

హైదరాబాద్‌లోని అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని ప్రజలను కోరారు. నిమ్స్‌ ఆస్పత్రిలో కిడ్నీ దందా అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని.. ఈ తప్పుడు వార్తలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లక్షలాది మంది రోగులకు వైద్య సేవలు అందిస్తున్న ఓ ప్రతిష్టాత్మక ఆస్పత్రిపై బురదజల్లే కుట్రగా అభివర్ణించారు. ఇలాంటి కుట్రలు, వాటికి పాల్పడే వ్యక్తుల పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని నిమ్స్ డైరెక్టర్ సూచించారు. ఇక అసలు ఏం జరిగిందనే వివరాలను నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప వివరించారు. నిమ్స్ ఆస్పత్రిలో పనిచేసే ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి.. కిడ్నీ ఆపరేషన్ చేయిస్తానంటూ డబ్బులు తీసుకున్నట్లుగా ఓ రోగి నుంచి తమకు ఫిర్యాదు అందిందని నిమ్స్ డైరెక్టర్ తెలిపారు. ఈ ఫిర్యాదు గురించి పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించామని.. దీనిపై పోలీసుల విచారణ జరుగుతోందన్నారు. అయితే ఆస్పత్రి యాజమాన్యం ప్రాథమిక విచారణ అనంతరం.. ఆరోపణలు వచ్చిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని విధుల నుంచి తప్పించినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉంటే.. వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే కొంతమంది నిమ్స్ ఆస్పత్రి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న నిమ్స్ డైరెక్టర్ బీరప్ప.. ఈ విషయాన్ని కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. స్వార్థపూరిత ప్రయోజనాల కోసం దురుద్దేశంతో అలాంటి వారు చేసే ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.మరోవైపు రోగుల బలహీనతలను ఆసరాగా చేసుకుని.. కొంతమంది కేటుగాళ్లు దందాలకు పాల్పడుతున్నారని.. నిమ్స్ ఆస్పత్రిలో ఓ ఉద్యోగి ఇలా రోగుల నుంచి భారీగా వసూళ్లు చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. నాగరాజు అనే ఓ ఉద్యోగి ఇలా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ వార్తలు రాగా.. నిమ్స్ ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగిపై తమకు రాతపూర్వకంగా ఫిర్యాదు అందిందని.. దీంతో అతన్ని విధుల నుంచి తప్పించినట్లు స్పష్టం చేసింది.