తిరుమల శ్రీవారి భక్తులు ఆ దర్శన టికెట్లపై వస్తున్న ఆరోపణల్ని నమ్మొద్దు.. టీటీడీ

Wait 5 sec.

భక్తుల కోసం వ్యవ‌స్థీకృతంగా, తిరుమల శ్రీవారి దర్శనం కోసం శ్రీ‌వాణి ఆన్ లైన్ విధానాన్ని పార‌ద‌ర్శకంగా అమ‌లు చేస్తున్నామని టీటీడీ తెలిపింది. 2019 మే నెల‌లో టీసీఎస్ స‌హ‌కారంతో మొద‌లుపెట్టిన ఆన్ లైన్ శ్రీ‌వాణి టికెట్ విధానాన్నే కొన‌సాగిస్తున్నామన్నారు. తిరుమ‌ల‌లో భ‌క్తుల విజ్ఞప్తి మేర‌కు ఆఫ్ లైన్ ద్వారా ఏరోజుకారోజు జారీ చేసే విధానాన్ని మార్పు చేశామన్నారు. మార్పు చేసిన ఈ విధానంలో ముందుగా ఎవ‌రైతే సాప్ట్‌వేర్ అప్లికేష‌న్ యాక్సెస్ చేస్తారో వారికే టికెట్ వ‌చ్చే విధంగా సాఫ్ట్‌వేర్ త‌యారు చేశామన్నారు. రోజుకి వేల సంఖ్యలో టికెట్లు పొందేందుకు భ‌క్తులు ప్రయ‌త్నిస్తున్నారన్నారు.ఈ కారణంగా మొద‌టి ఒక‌టిన్నర నిమిషంలోపే ముందు వ‌చ్చిన వారికి ముందు ఇచ్చే విధానంలో లాక్ చేస్తారన్నారు. అనంతరం పేమెంట్ గేట్ వేలో విజ‌యవంతంగా డ‌బ్బులు చెల్లించిన‌వారికి టికెట్లు జారీ చేస్తున్నామన్నారు. ఏదైనా కార‌ణం వ‌ల్ల డ‌బ్బులు చెల్లింపులు జ‌ర‌గ‌కపోతే అలాంటి టికెట్లను తిరిగి పూల్‌లోకి తీసుకొస్తారన్నారు. ఈ ప్రకియ ఐఆర్‌సీటీసీ, ప్రభుత్వ ఇత‌ర‌ అడ్వాన్స్ బుకింగ్ స‌ర్వీసుల్లో ప్రవేశ‌పెట్టారన్నారు. ఈ విధానంలో మానవ ప్రమేయం ఉండదని..సిస్టమ్ ఆటోమేటిక్‌గా పని చేస్తుందన్నారు.ప‌ది నిమిషాల త‌ర్వాత వాస్తవ‌మేనని.. పేమెంట్ గేట్ వే వ‌ద్ద చెల్లింపు స‌మ‌యంలో సాంకేతిక లోపం, ఇత‌ర కార‌ణాల చేత టీటీడీకి డ‌బ్బు జ‌మ అయిన‌ట్లు మెసేజ్ రాకుంటే అలాంటి టికెట్ల‌ను తిరిగి పూల్‌లోకి తీసుకొచ్చి భ‌క్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా సాఫ్ట్ వేర్ అభివృద్ధి చేశారని చెబుతోంది టీటీడీ. జీఎం ఐటీగా క‌నీస అర్హత‌లు లేని వ్యక్తిని నియ‌మించార‌ని చెప్పడం వాస్తవ విరుద్ధమని.. వారికి ఎం.టెక్ (కంప్యూట‌ర్ సైన్స్), ఎం.ఎస్ (ఇన్నర్మేష‌న్ సిస్టమ్స్) అర్హత‌తో పాటుగా 32 సంవ‌త్సరాలుగా ఐటీలో సుదీర్ఘ అనుభ‌వం ఉండ‌టంతో స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్ కింద వారిని జీఎం ఐటీ ఎఫ్ఏసీగా మాత్రమే నియ‌మించారు అన్నారు. సాఫ్ట్వేర్‌కు సంబంధించి టీసీఎస్ కొత్తగా సాప్ట్ వేర్ తీసుకురాలేదన్నారు. 2019 లో తీసుకొచ్చిన సాప్ట్ వేర్ నే వినియోగంలో ఉంచి ఎప్పటిక‌ప్పుడు భ‌క్తుల నుండి వ‌చ్చే స‌ల‌హాలు, సూచ‌న‌ల మేర‌కు కాలానుగుణంగా టీసీఎస్ ద్వారా సాప్ట్ వేర్‌ను మార్పు చేస్తున్నామన్నారు.భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఆటో ఫిల్లింగ్‌, కాపీ, పేస్ట్ ప్రక్రియ విధానాలను పూర్తిగా ర‌ద్దు చేసి అంద‌రికీ స‌మాన అవ‌కాశాలు క‌ల్పిస్తోంది అన్నారు. ఆ త‌ర్వాత టీటీడీలో ఉన్న అన్ని సిస్టమ్స్ ఆడిట్ ల‌ను ఏపీ టెక్నాల‌జీ స‌ర్వీసెస్ (ఏపీటీఎస్) ద్వారా ప్రతి ఏడాది ఆడిట్ చేస్తారన్నారు. టీటీడీ మాజీ ఛైర్మన్ ప్రద‌ర్శించిన శ్రీ‌వాణి టికెట్ బుకింగ్ ప్రక్రియ పూర్తి అవగాహనతో చేసినట్లు అనిపించలేదు అన్నారు. వారు టికెట్ బుక్ చేసుకునే స‌మ‌యంలో పేమెంట్ గేట్ వే వ‌ర‌కు వెళ్లారిన..దీనిని వారు సాంకేతిక లోపమని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ వారి అకౌంట్‌లో స‌రిప‌డ డబ్బులు లేకపోవడం వల్ల పేమెంట్ గేట్ వే ద‌గ్గర వారి ట్రాన్సాక్షన్ రిజెక్ట్ అయ్యిందన్నారు. ఆ తర్వాత తిరిగి ప్రయ‌త్నించ‌డం వ‌ల్ల అది సాంకేతికంగా కొత్త ప్రయ‌త్నం కింద లెక్కిస్తారన్నారు. అప్పటికే వారి ముందున్న వారిని సిస్టమ్ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటుంది కాబట్టి.. దీంతో వెయిటింగ్ లిస్టులో వెనుకబడి ఉన్నారన్నారు. ఈ అంశాలు సాంకేతిక ప‌రిజ్ఞానం ఉన్న వారికి మాత్రమే అర్థమ‌వుతుందన్నారు.