తెలంగాణకు చల్లని కబురు.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

Wait 5 sec.

భీకరమైన ఎండలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక చల్లని కబురు అందించింది. ఈ నెల 26వ తేదీన నైరుతి రుతుపవనాలు అండమాన్‌ నికోబార్‌ దీవుల మీదుగా ప్రయాణించి కేరళ తీరాన్ని తాకనున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అక్కడ నుంచి వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే.. మరో నాలుగైదు రోజుల్లోనే ఇవి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రుతుపవనాల రాకతో జూన్ మొదటి వారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే నేడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసి కాస్త ఉపశమనం కలిగించే అవకాశం ఉందన్నారు.రుతుపవనాలు వచ్చే వరకు రాష్ట్రంలో వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడని చెబుతున్నారు. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ పరిధిలోని ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌తో పాటు నిజామాబాద్‌ జిల్లాల్లో రికార్డు స్థాయిలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా దక్షిణ తెలంగాణ పరిధిలోని మహబూబ్‌నగర్‌, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి 41 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అంటున్నారు. రాజధాని హైదరాబాద్ సహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ సగటున 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోందన్నారు. మధ్యాహ్నం వేళల్లో వేడి గాలులు వీస్తుండటంతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు.తీసుకోవాల్సిన జాగ్రత్తలురాష్ట్రంలో ఎండల తీవ్రత 44 డిగ్రీ సెల్సియస్ మార్కును తాకిన నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలు బయటకు రాకపోవడమే మంచిదని అంటున్నారు. ప్రయాణాలు చేయాల్సి వస్తే తలకు టోపీ, రుమాలు, గొడుగు వంటివి తప్పనిసరిగా వాడాలని చెబుతున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉండేందుకు నిరంతరం మంచినీరు, ఓఆర్‌ఎస్ ద్రావణం, కొబ్బరిబొండాలు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలని అంటున్నారు. కాటన్ దుస్తులను ధరించడం వల్ల శరీరం చల్లగా ఉంటుందని... వేసవిలో వచ్చే డీహైడ్రేషన్, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని వైద్య ఆరోగ్య నిపుణులు సూచించారు.