తిరుమల శ్రీవారిని ఒకే టికెట్‌పై మూడు రోజులు దర్శనం చేసుకునే అరుదైన అవకాశం.. బుక్ చేస్కోండి

Wait 5 sec.

తిరుమల శ్రీవారిని ఒకే టికెట్‌పై వరుసగా మూడు రోజుల పాటూ దర్శనం చేసుకునే అద్భుత అవకాశం భక్తులకు వచ్చింది. తిరుమలలో ఆగస్టు నెలలో నిర్వహించే పవిత్రోత్సవాల్లో భాగంగా భక్తులకు అవకాశం దక్కింది. పవిత్రోత్సవాలలో భాగంగా మూడు రోజుల పాటూ ఒకే టికెట్‌పై శ్రీవారి మూలమూర్తిని దర్శించుకునేందుకు భక్తులు టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తిరుమలలో జరిగే ఈ సేవలో పాల్గొలనుకునే భక్తులకు ఈ నెల 21న ఉదయం 10 గంటలకు టీటీడీ ప్రత్యేకంగా టికెట్లను ఆన్‌లైన్‌లో జారీ చేయనుంది. 21న ఉదయం 10 గంటలకు టీటీడీ పవిత్రోత్సవాల టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. వార్షిక పవిత్రోత్సవాల (23-08-26 నుంచి 25-08-26) టికెట్లను కూడా మే 21 ఉదయం 10గం. తెలిపింది.భక్తులు ఈ టికెట్‌ను ఇద్దరికీ కలిపి రూ.5,000 చెల్లించి కొనుగోలు చేయాలి. ఈ టికెట్లు పొందిన భక్తులు తిరుమలలో నిర్వహించే పవిత్రోత్సవాలు జరిగే మూడురోజులు స్నపన తిరుమంజనంలో పాల్గొనే అవకాశం ఇస్తారు. అంతేకాదు పవిత్రోత్సవాలలో భాగంగా చివరిరోజు పూర్ణాహుతిలోకూడా పాల్గొనవచ్చు. తిరుమలలో పవిత్రోత్సవాల్లో పాల్గొనే భక్తులు ఉదయం 7 గంటలకు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1 దగ్గరకు సంప్రదాయ వస్త్రధారణతో చేరుకుని ఏదైనా ఫొటో గుర్తింపు కార్డును చూపిస్తే అనుమతిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఆగస్టు 23 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలు ఆగస్టు 22న అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏడాది పొడవునా జరిగే అర్చనలు, ఉత్సవాల్లో భక్తులు, సిబ్బంది వల్ల తెలియక కొన్ని దోషాలు జరుగుతాయి. టీటీడీ ఆగమశాస్త్రం ప్రకారం దోషాలు వల్ల ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ మేరకు టీటీడీ ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది.