Multibagger: స్మాల్ క్యాప్ కేటగిరి, పేపర్ ప్రొడక్ట్స్ కంపెనీ గౌతమ్ ఎగ్జిమ్ లిమిటెడ్ () తమ షేర్ హోల్డర్లకు శుభవార్త చెప్పింది. కంపెనీ బోర్డు డైరెక్టర్స్ సమావేశంలో 1:2 రేషియోలో స్ప్లిట్, 3:1 రేషియోలో బోనస్ షేర్స్ కి ఆమోదం తెలిపారు. దీంతో ఈ స్టాక్ ఫోకస్ లోకి వచ్చింది. ఈ బెనిఫిట్స్ అందుకునేందుకు అర్హులైన షేర్ హోల్డర్లను నిర్ణయించే రికార్డు తేదీని సైతం నిర్ణయించారు. షేర్లు కొనుగోలు చేసి వాటా కలిగి ఉన్న వారికి , స్టాక్ స్ప్లిట్ చేపట్టేందుకు అర్హత లభిస్తుంది. ఈ స్టాక్ స్ప్లిట్, బోనస్ ఇష్యూ తర్వాత 100 షేర్స్ 800 షేర్లుగా మారనున్నాయి. అయితే, అందుకు తగినట్లుగానే షేరు ధర తగ్గుతుందని ఇన్వెస్టర్లు గమనించాలి.కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో 1:2 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేయాలని నిర్ణయించారు. అంటే రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 ఈక్విటీ షేరుని రూ. 5 ముఖ విలువ ఉండేలా 2 షేర్లుగా విభజిస్తారు. అలాగే ఈ సమావేశంలోనే 3:1 రేషియోలో బోనస్ షేర్లు ఇవ్వాలని నిర్ణయించారు. అర్థం రికార్డు డేట్ నాటికి రూ. 5 ఫేస్ వ్యాల్యూ ఉండే 1 షేరుని కొని ఉన్న వారికి అదనంగా రూ. 5 ఫేస్ వ్యాల్యూ ఉన్న 3 షేర్లను ఉచితంగా బోనస్ రూపంలో ఇస్తారు. ఈ రెండు బెనిఫిట్స్ అందుకునేందుకు అర్హులైన వాటాదారులను నిర్ణయించే రికార్డు తేదీని మే 22, 2026గా నిర్ణయించారు. స్టాక్ మార్కెట్ చివరి ట్రేడింగ్ సెషన్లో గౌతమ్ ఎగ్జిమ్ కంపెనీ షేరు 1.17 శాతం లాభంతో రూ. 313.85 వద్ద ముగిసింది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 369.50గా ఉండగా 52 వారాల కనిష్ఠ స్థాయి రూ. 121.75 వద్ద ఉంది. గత వారంలో ఈ షేరు 1 శాతం నష్టపోయింది.గత ఆరు నెలల్లో 30 శాతం లాభాన్ని ఇచ్చింది. గత ఏడాదిలో 150 శాతం లాభాన్ని ఇచ్చింది. గత ఐదేళ్లలో 1255 శాతం లాభాన్ని ఇచ్చింది. ఐదేళ్ల క్రితం ఇందులో రూ.5 లక్షలు పెట్టి షేర్లు కొని ఇప్పటి వరకు కొనసాగిన వారికి ఇప్పుడు ఆ షేర్ల విలువ రూ.13.55 లక్షల వరకు అవుతుంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ.96 కోట్ల వద్ద ఉంది. అలాగే ఈ స్టాక్ స్ప్లిట్, బోనస్ ఇష్యూ తర్వాత షేరు ధర భారీగా తగ్గనుంది. అయితే, ఇన్వెస్టర్ల పెట్టుబడిలో మాత్రం ఏ మార్పు ఉండదు. షేర్ల సంఖ్య భారీగా పెరుగుతుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు అందుబాటు ధరలో ఉండేలా చేసేందుకు కంపెనీ ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది.