పెట్రోల్, డీజిల్ ధరల్లో తెలుగు రాష్ట్రాలే టాప్.. ఏ రాష్ట్రాలు, ఏ నగరాల్లో లీటరుకు ధరెంతో లిస్ట్ ఇదిగో..

Wait 5 sec.

: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో.. . మే 15న లీటరుపైన రూ. 3 కుపైగా పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటన విడుదల చేశాయి. దీంతో వాహనదారులపై మరింత భారం పడనుంది. ఇక ధరలు దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండవు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్ (VAT), ఇతర సెస్సుల కారణంగా ధరలు ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయని చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో రెండు తెలుగు రాష్ట్రాలే (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) టాప్‌లో ఉండటం గమనార్హం. ఇక్కడ దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో హైదరాబాద్ టాప్‌లో ఉంది. మొత్తంగా జిల్లాల వారీగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో ధరలు అధిక స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు నగరాల వారీగా ఎక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం. హైదరాబాద్‌లో తాజాగా పెట్రోల్ ధర లీటరుపై రూ. 3.39 పెరిగింది. దీంతో ఇప్పుడు ఇక్కడ లీటరు పెట్రోల్ ధర రూ. 110.89 కి చేరింది. ఇదే దేశంలోని ప్రధాన మెట్రో సిటీల్లో టాప్. మిగతా మెట్రో నగరాల్లో చూస్తే ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 106.64 గా ఉంది. చెన్నైలో రూ. 103.90 గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర లీటరు రూ. 108.74 గా ఉంది. న్యూ ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ. 97.77 గానే ఉండటం విశేషం. ప్రధాన నగరాల్లో చూస్తే తిరువనంతపురంలో లీటర్ పెట్రోల్ రూ. 110.75 తో రెండో స్థానంలో ఉంది. తర్వాత కోల్‌కతా రూ. 108.74 తో మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్ పెట్రోల్ ధర..అదే డీజిల్ ధరల విషయానికి వస్తే కూడా మెట్రో సిటీల్లో హైదరాబాద్‌లోనే అత్యధికంగా ఉన్నాయి. ఇక్కడ తాజాగా లీటరుపై రూ. 3.26 చొప్పున పెరగ్గా రూ. 98.96 పలుకుతోంది. ఇతర మెట్రో నగరాల్లో చూస్తే ఢిల్లీలో రూ. 90.67 గా ఉండగా.. చెన్నైలో రూ. 95.47 గా ఉంది. బెంగళూరులో రూ. 94.10 పలుకుతోంది. కోల్‌కతాలో రూ. 95.13 గా ఉంది. ఇక ప్రధాన నగరాల్లో చూస్తే తిరువనంతపురంలో అత్యధికంగా రూ. 99.63 గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు..ఇదిలా ఉండగా.. ఓవరాల్‌గా అంటే జిల్లాల వారీగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్రాల్లోనే ధరలు అధికంగా పలుకుతుండటం గమనార్హం. విజయవాడలో లీటరు పెట్రోల్ ధర ఇప్పుడు రూ. 3.29 పెరిగి రూ. 113.03 వద్ద ఉంది. ఇక్కడ డీజిల్ ధర ఏకంగా రూ. 100.71 కి చేరింది. గుంటూరులో చూసినట్లయితే డీజిల్ ధర లీటరుకు రూ. 100.49 గా ఉండగా.. పెట్రోల్ లీటరుకు రూ. 112.79 గా ఉంది. పెట్రోల్, డీజిల్ ధరల్లో తేడా ఎందుకు?ఇంధన ఉత్పత్తులు అనేవి.. జీఎస్టీ పరిధిలోకి రావు కాబట్టి.. ప్రతి రాష్ట్రం తమ సొంత ఆదాయ వనరుల కోసం స్వతంత్రంగా పన్నులు విధించుకుంటుంది. ఇక్కడ ప్రధానంగా వ్యాట్, రోడ్ డెవలప్‌మెంట్ సెస్ వంటివి ఉంటాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ రుసుములు తక్కువగా ఉన్నందున ధరలు తక్కువగా ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో అధిక వ్యాట్, సెస్ నేపథ్యంలో ధరలు అధికంగా ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్.. పెట్రోల్, డీజిల్‌పై అధిక వ్యాట్, సెస్ విధిస్తుంది. గతంలో అధిక ధరల నేపథ్యంలో.. కొన్ని రాష్ట్రాలు వ్యాట్ వంటివి తగ్గించినా.. కొన్ని రాష్ట్రాలు మాత్రం తగ్గించకుండా స్థిరంగా ఉంచడం లేదా స్వల్పంగా తగ్గించడం చేశాయి.