వైసీపీలోకి మోపిదేవి.. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వను కానీ.. వైఎస్ జగన్ కీలక హామీ..!

Wait 5 sec.

కాంగ్రెస్ సీనియర్ నేత పార్టీని వీడారు. తాజాగా వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మోపిదేవి శ్రీనివాసరావుతోపాటు.. రేపల్లెకు చెందిన తన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన వైఎస్ జగన్.. పార్టీకి కార్యకర్తలే నిజమైన బలమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రేపల్లెపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు చెప్పిన వైఎస్ జగన్.. అక్కడ వైసీపీ ఇంఛార్జ్, యువ నాయకుడు మోహన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో మోపిదేవి శ్రీనివాసరావుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన జగన్.. కీలక హామీ మాత్రం ఇచ్చినట్లు తెలుస్తోంది.తాను వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానిని అని చెప్పిన మోపిదేవి.. దివంగత నేత తన ఇంటికి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు వైసీపీలో చేరడంతో తన జన్మ ధన్యమైందని పేర్కొన్నారు. వైసీపీ గెలుపుకోసం తాను పనిచేస్తానని.. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ఇక రేపల్లె నియోజకవర్గంలో మోహన్‌ను గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని ఈ సందర్భంగా మోపిదేవి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రేపల్లె నియోజకవర్గ రాజకీయాలపై వైఎస్ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రేపల్లెలో పార్టీ భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు. రేపల్లె నియోజకవర్గంలో మోహన్ పనితీరును ప్రత్యేకంగా అభినందించారు. ఎంతో ఉత్సాహవంతుడైన మోహన్.. రేపల్లె నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడని కొనియాడారు. ఈ సందర్భంగా యువత రాజకీయాల్లోకి రావడం పార్టీకి కొత్త జవసత్వాలని ఇస్తుందని వైఎస్ జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మోపిదేవి శ్రీనివాసరావు పాత్రపై కీలక వ్యాఖ్యలు చేసిన జగన్.. మోహన్‌ను ఆయన తన సొంత తమ్ముడిగా భావించి అతని గెలుపు కోసం కృషి చేస్తున్న తీరు పట్ల ప్రశంసలు కురిపించారు. రేపల్లెలో మోహన్ గెలుపు బాధ్యతను మోపిదేవి శ్రీనివాసరావు.. తన భుజస్కంధాలపై వేసుకున్నాడని.. ఈ ప్రయాణంలో తాను కూడా తోడుగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మోపిదేవి శ్రీనివాసరావు కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుందని భరోసా ఇచ్చారు. ఆయనకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగిస్తానని ఈ సందర్భంగా జగన్ స్పష్టం చేశారు.