16 బంతుల్లో 50 రన్స్.. బుమ్రా అండ్ కోను ఉతికారేసిన పంజాబ్ బ్యాటర్లు..!

Wait 5 sec.

ఐపీఎల్ 2026లో ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగుపర్చుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు చేసింది. ఓ దశలో తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించిన పంజాబ్ కింగ్స్.. చివరి మూడు ఓవర్లలో బ్యాట్ ఝుళిపించి.. 200 పరుగుల మార్కు చేరుకుంది. 140 పరుగులలే 7 వికెట్లు కోల్పోయినా.. ఆ జట్టు భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌ ద్వారా తన ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ బుమ్రా.. తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి వికెట్‌కు 33 బంతుల్లో 50 రన్స్ జోడించిన తర్వాత ప్రియాన్ష్ ఆర్యా (22) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ప్రభ్‌ సిమ్రాన్ సింగ్ 32 బంతుల్లో 57 రన్స్ చేసి.. జట్టు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కానీ అతడు ఔట్ అయిన తర్వాత మ్యాచ్ గమనమే మారిపోయింది. శ్రేయస్ అయ్యర్ (4), సుయాన్ష్ హెడ్గే (8), శశాంక్ సింగ్ (2), మార్కో జాన్సెన్ (2) విఫలమయ్యారు. దీంతో 140 పరుగులకే పంజాబ్ 7 వికెట్లు కోల్పోయింది.వరుసగా వికెట్లు కోల్పోయిన పంజాబ్ కింగ్స్.. కనీసం 180 రన్స్ అయినా చేస్తుందా అని అనిపించింది. కానీ ఇక్కడ మ్యాచ్ టర్న్‌ అయింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (17 బంతుల్లో 38 రన్స్‌), విష్ణు వినోద్ (8 బంతుల్లో 15 రన్స్ నాటౌట్‌), జేవియర్ బార్ట్‌లెట్ (7 బంతుల్లో 18 రన్స్‌ నాటౌట్‌) బ్యాట్ ఝుళిపించడంతో భారీ స్కోరు చేసింది. ఏకంగా నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్.. 16 బంతుల్లో 50 రన్స్ సాధించడం గమనార్హం.ముంబై ఇండియన్స్ బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు. దీపక్ చాహర్ 2, కార్బిన్ బాష్ 1, రాజ్ బవా ఒక వికెట్ తీశారు.