ఇది కదా కావాల్సింది.. మోదీ పిలుపుతో కదిలిన హర్ష్ గోయెంకా.. ఏం చేశారంటే?

Wait 5 sec.

Harsh Goenka: పశ్చిమాసియా సంక్షోభం వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పొదుపు మంత్రం చెప్పారు. విదేశీ మారకం నిల్వలను ఆదా చేసుకునే చర్యలను ప్రతిపాదించారు. చమురు వినియోగం తగ్గించాలని, ప్రజలు సొంత వాహనాలు కాకుండా ప్రజా రవాణా ఉపయోగించాలని, వీలైన కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించాలని కీలక చర్యలు వెల్లడించారు. పారిశ్రామిక రంగంలో తొలి అడుగు వేసి దేశం కోసం మోదీ ఇచ్చిన పిలుపు ప్రకారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ ప్రతిపాదించిన పలు పొదుపు చర్యలు పాటించేందుకు తమ కంపెనీ సిద్ధమని చాటి చెప్పారు. ఇందులో భాగంగానే ఇప్పటికే తమ ఉద్యోగులకు కీలక ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. తమ ఉద్యోగులకు జారీ చేసిన అంతర్గత అడ్వైజరీని ఆయన పంచుకున్నారు. ' ప్రధాన మంత్రి మోదీ ఇచ్చిన పిలుపునకు తగ్గట్టుగా మా ఆర్‌జీపీ గ్రూప్ స్పందించింది. ఇతర కార్పొరేట్ కంపెనీలు సైతం దానిని పాటిస్తాయని ఆశిస్తున్నాను.' అని పేర్కొన్నారు. తమ ఆర్‌జీపీ గ్రూప్ తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలను తన ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు. ఉద్యోగులకు కీలక సూచనలు చేసినట్లు చెప్పారు.విదేశీ ప్రయాణాలను కనిష్ఠ స్థాయికి తగ్గించుకోవాలిదేశీయ విమాన ప్రయాణాలనూ గణనీయంగా తగ్గించుకోవాలి. సిటీల మధ్య రాకపోకలను సాధ్యమైనంత మేరకు నివారించాలి. ఇంటి నుంచి పని చేయగల ఉద్యోగులను ఆ దిశగా ప్రోత్సహించాలి. నిత్యం జరిగే అంతర్గత సమీక్షలు, సమావేశాలను సాధ్యమైనంత మేరకు వర్చువల్ గా నిర్వహించాలి. ఉద్యోగులు కార్ పూలింగ్, ప్రజా రవాణా ఎంచుకోవాలి. అలాగే ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలకు మారాలి.క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. బ్యారెల్ క్రూడ్ ఆయిల్ రేటు 110 డాలర్లు దాటేసింది. భారత్ దిగుమతుల్లో ఆయిల్, బంగారం కొనుగోలుకే అధికంగా విదేశీ మారక నిల్వలను వెచ్చించాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే విదేశీ మారక నిల్వలను కాపాడుకునే ప్రయత్నాలను కేంద్రం మొదలు పెట్టింది. ఇప్పటికే ప్రధాని మోదీ సూచనలతో ప్రభుత్వ పరంగా జరిగే వ్యయాన్ని కట్టడి చేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వాలు, కంపెనీలు చర్యలు తీసుకునేందుకు ముందుకు వస్తున్నాయి. తమ కంపెనీ ఉద్యోగులు తప్పకుండా వారంలో ఒక రోజు ఇంటి నుంచి పని చేయాలని షాదీ.కామ్ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పుడు హర్ష్ గోయెంకా సైతం తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నట్లు చెప్పారు. మరిన్ని కంపెనీలు ఇదే దారిలో నడిచే అవకాశాలు ఉన్నాయి.