ఏడాదిలో రూ.6000 పెరిగిన 'హైదరాబాద్' స్టాక్.. లక్ష పెడితే రూ.5 లక్షలొచ్చాయ్.. ఇప్పుడు భారీ ఆర్డర్‌తో ఫోకస్‌లోకి..

Wait 5 sec.

Hyderabad Stock: మిడ్ క్యాప్ కేటగిరిలోని డిఫెన్స్ సెక్టార్‌కి చెందిన దిగ్గజ కంపెనీ MTAR టెక్నాలజీస్ లిమిటెడ్ (MTAR Technologies Limited) షేర్లు కాసులు కురిపిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం నిర్వహిస్తోన్న ఈ సంస్థ స్టాక్ ఈరోజు (మే 14వ తేదీ) ట్రేడింగ్ సెషన్లో ఏకంగా 15 శాతానికి పైగా లాభాన్ని అందించింది. దీంతో సరికొత్త 52 వారాల గరిష్ఠ ధర రూ. 7730ను నమోదు చేసింది. ఈరోజు ఈ స్టాక్ భారీ ర్యాలీ చేసింది. అంతే కాదు ఈ కంపెనీ షేరు గత ఏడాదిలోనే రూ. 6000 పెరిగింది. లక్ష రూపాయల పెట్టుబడిని రూ. 5 లక్షలు చేసింది. మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఒకటిగా నిలిచింది.కంపనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. అంతర్జాతీయ కంపెనీ నుంచి తమకు రూ. 2,278.96 కోట్లు విలువైన రక్షణ ఉత్పత్తుల కోసం ఆర్డర్ లభించినట్లు ఎంటీఏఆర్ తెలిపింది. దీంతో ఈ స్టాక్ ఈరోజు ట్రేడింగ్‌లో ఫోకస్‌లోకి రావడమే కాదు ఇన్వెస్టర్లను ఆకర్షించింది. భారీ కొనుగోళ్ల మద్దతుతో సరికొత్త గరిష్ఠాలను నమోదు చేసింది. ఈరోజు ట్రేడింగ్ సెషన్లో మార్కెట్లు ముగిసే నాటికి 12.29 శాతం లాభంతో రూ. 7595 వద్ద ముగిసింది. ఒక దశలో 15 శాతానికి పైగా లాభంతో రూ. 7730ని తాకింది.గత వారం రోజుల్లో ఈ షేరు 13 శాతం లాభాన్ని ఇవ్వగా గత నెల రోజుల్లో 53 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లో 189 శాతం లాభాన్ని ఇచ్చింది. గత ఏడాది కాలంలో 399 శాతం లాభాన్ని ఇచ్చింది. లక్ష రూపాయలు పెట్టిన వారికి ఏడాదిలోనే రూ. 5 లక్షలు వచ్చినట్లయింది. గత ఐదేళ్లలో 748 శాతం లాభాన్ని అందించింది.ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 23,340 కోట్లుగా ఉంది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 7730గా ఉండగా 52 వారాల కనిష్ఠ ధర రూ. 1,390.50 వద్ద ఉంది.ప్రమాణాలతో హై ప్రెసిషన్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ అందిస్తోంది. ఈ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ కంపెనీని 1970లో ప్రారంభించారు. అయితే ఈ కథనం కేవలం సమాచారం ఇవ్వడానికే. గతంలో వచ్చిన రిటర్న్స్ భవిష్యత్తులో వస్తాయని చెప్పలేం. స్టాక్ మార్కెట్లో హైరిస్క్ ఉంటుంది.