ప్లే ఆఫ్స్ రేసులో నిలిచేందుకు డూ ఆర్ డై మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈడెన్ గార్డెన్స్ పిచ్ బౌలింగ్‌కి సహకరించడం, సెకండ్ ఇన్నింగ్స్‌కి డ్యూ ప్రభావం ఎక్కువగా ఉండటం టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కలిసొచ్చింది. ఈ విజయంతో కేకేఆర్ తన ప్లే ఆఫ్స్ ఆశలను సజీవం చేసుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన ముంబై ఇండియన్స్ పవర్ ప్లేలోనే టాప్ ఆర్డర్ మొత్తాన్ని కోల్పోయింది. 41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ముంబైని తిలక్ - పాండ్యా కాసేపు ముందుకు తీసుకెళ్లినా.. ఆఖర్లో కార్బిన్ బాష్ చెలరగేడంతో 147/8 పరుగులు చేయగలిగింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించి 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి ఓవర్‌లోనే ఫిన్ అలెన్ వికెట్ కోల్పోయింది. పవర్ ప్లే చివరి ఓవర్‌లో కెప్టెన్ అజింక్య రహానే అవుటయ్యాడు. ఆ వెంటనే ఎనిమిదో ఓవర్‌లో కామెరూన్ గ్రీన్ కూడా వికెట్ కోల్పోయాడు. దాంతో 7.1 ఓవర్లలో 54 పరుగులకు కేకేఆర్ మూడు వికెట్లు కోల్పోయింది. ఫస్ట్ డౌన్‌లో క్రీజులోకి వచ్చిన మ్యాచ్‌ని నిలబెట్టాడు. ముంబై బౌలర్లను దీటుగా ఎదుర్కొని మరీ పరుగులు రాబట్టాడు. బౌలింగ్‌కి సహకరిస్తున్న పిచ్‌లోనూ బౌండరీలతో రాణించాడు. మనీష్ పాండే మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్‌తో కేకేఆర్ మిడిల్ ఓవర్లలో వికెట్లు చేజార్చుకోలేదు. 33 బంతులు ఆడిన మనీష్ పాండే ఆరు ఫోర్లతో 45 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే 30 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 40 పరుగులు చేసిన రోవ్‌మన్ పావెల్ కూడా అవుటయ్యాడు. మనీష్ పాండే - రోవ్‌మన్ పావెల్ వెంటవెంటనే అవుటవ్వడంతో కేకేఆర్ ఆఖర్లో తడబడింది. అంగ్‌క్రిష్ రఘువంశీ స్థానంలో కన్‌కషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన తేజస్వి సింగ్ 12 బంతుల్లో 11 పరుగులు చేసి అవుటవ్వగా.. రింకూ సింగ్ బౌండరీతో జట్టుకు విన్నింగ్ షాట్ అందించాడు. కేకేఆర్ 18.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 13 పాయింట్లతో ఎనిమిదో స్థానం నుంచి ఆరో స్థానానికి ఎగబాకింది. కేకేఆర్ తన చివరి మ్యాచ్‌లో ఢిల్లీని ఓడించి.. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ జట్లు తమ ఆఖరి మ్యాచ్‌లలో ఓడిపోతే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది.