GT vs CSK: అహ్మదాబాద్‌లో అసలైన పోరు.. గుజరాత్‌కి గెలిస్తే క్వాలిఫైయర్-1 బెర్త్ కన్ఫార్మ్!

Wait 5 sec.

ఐపీఎల్ 2026లో భాగంగా 66వ మ్యాచ్‌లో జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. గుజరాత్ - చెన్నై ఇరు జట్లకి ఈ మ్యాచ్ చాలా కీలకం. ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకోవాలంటే చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. మరోవైపు క్వాలిఫైయర్ -1లో ఆడే అవకాశం దక్కించుకోవాలంటే గుజరాత్ టైటాన్స్ కూడా ఈ మ్యాచ్‌లో విజయం సాధించాల్సిందే. దాంతో ఈ మ్యాచ్‌ రసవత్తరంగా సాగడం ఖాయం. ఈ ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకోగా.. పదో స్థానం నుంచి సీజన్‌కు ముగింపు పలుకుతుంది అనుకున్న చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన కమ్ బ్యాక్‌తో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. ఐదో స్థానం నుంచి చెన్నై సూపర్ కింగ్స్ ఏడో స్థానానికి పడిపోయింది. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 9 మ్యాచ్‌లలో తలపడ్డాయి. అందులో ఇరు జట్లు పోటాపోటీగా ఆడగా గుజరాత్ ఐదు, చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఆడిన ఒక్క మ్యాచ్‌లో కూడా గుజరాతే విజయం సాధించింది. చెన్నై హోం గ్రౌండ్ చెపాక్‌లో ఆ జట్టును ఓడించి గుజరాత్ విజిల్స్ మోత మోగించింది. దాంతో గుజరాత్ హోం గ్రౌండ్‌లో ఆ జట్టును ఓడించాలని సీఎస్కే చూస్తోంది. గుజరాత్ టైటాన్స్ జట్టు అంచనాసాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్, నిషాంత్ సింధూ, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, అర్షద్ ఖాన్, కగిసో రబడా, ఆర్.సాయి కిశోర్, మొహమ్మద్ సిరాజ్. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అంచనాసంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డివాల్డ్ బ్రెవిస్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, అకేలా హోసెన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, స్పెన్సార్ జాన్సన్, ముకేశ్ చౌదరి.