'జగన్‌కు అప్పుడే చెప్పినా వినలేదు.. జనసేనలో పదవులు అడగడానికి నాకు ఏం అర్హత ఉంది': బాలినేని

Wait 5 sec.

వైఎస్సార్‌సీపీని బలోపేతం చేయడం జగన్‌ వల్ల కావడం లేదన్నారు మాజీ మంత్రి, జనసేన పార్టీ నేత . జగన్ అనాలోచిత నిర్ణయాలు, మొండి వైఖరితో పార్టీని, రాష్ట్రాన్ని దెబ్బతీశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ నాయకత్వ లోపం, ఒంటెద్దు పోకడల కారణంగానే నేతలు, ప్రజలు పార్టీకి దూరమయ్యారన్నారు. పార్టీని అభివృద్ధి చేయడం జగన్‌కి చేతకాదంటూ ఎద్దేవా చేశారు. జగన్ తీసుకున్న కొన్ని మూర్ఖపు నిర్ణయాల కారణంగానే 2024 ఎన్నికల్లో తాను ఓడిపోయానన్నారు. తాను ఓడిపోవడానికి వ్యక్తిగతమైన అంశాలు కారణం కాదన్నారు. గత ప్రభుత్వంలో జగన్ సీఎంగా బటన్లు నొక్కారు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. హయాంలో గుంటూరు నాగార్జున యూనివర్శిటీ దగ్గర రాజధానిని ఏర్పాటు చేస్తే బావుంటుందని జగన్‌కు చెప్పానని.. కానీ ఆయన పట్టించుకోలేదన్నారు బాలినేని. తాను రాజధాని విషయంలో సజ్జలకు కూడా సూచనలు చేశానని.. ఎవరూ పట్టించుకోలేదన్నారు.మరోసారి జగన్ మావిగన్ పేరుతో మరోసారి మూర్ఖత్వపు నిర్ణయం తీసుకుంటున్నారన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్ర రాజధాని మావిగన్ అని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. తన కుమారుడు బాలినేని ప్రణీత్ ఎప్పటి నుంచో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారని చెప్పుకొచ్చారు. తాను ఎన్నికల తర్వాత జనసేన పార్టీలో చేరానని.. కాబట్టి తనకు పదవులు అడగడానికి అర్హత లేదన్నారు బాలినేని శ్రీనివాస రెడ్డి.పెట్రోల్ ధరలు పెరగడానికి కూటమి కారణం అన్నట్లు వైఎస్సార్‌సీపీ ధర్నా చేసిందని.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేది కేంద్ర ప్రభుత్వమన్న సంగతి జగన్‌కు తెలియదా అంటూ ప్రశ్నించారు బాలినేని. గతంలో సోనియా గాంధీని జగన్ ఎదురించి పార్టీ పెట్టారని అందరూ పొగిడారని.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి జగన్‌కు ధైర్యం లేదన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబాల గురించి విమర్శించిన సమయంలో 30మంది ఎమ్మెల్యేల సమక్షంలో ఖండించానన్నారు. అప్పుడే జగన్ పార్టీ నేతల్ని కంట్రోల్ చేసి ఉంటే బావుండేదన్నారు.. అసలు జగన్‌కు క్రెడిబులిటీ లేదన్నారు. తాను ఎప్పుడూ పాలసీలపై మాట్లాడతానని.. ఎప్పుడూ ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడలేదన్నారు.