రూ. 10 వేల సిప్‌తో ఒకేసారి 14 లక్షలు.. లిస్టులో SBI, LIC స్కీమ్స్.. ఐదేళ్లలోనే అద్భుత లాభాలు!

Wait 5 sec.

: పెట్టుబడులు పెట్టాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ ఎప్పుడు ఎక్కడ ఎందులో ఎంత ఇన్వెస్ట్ చేయాలన్న దానిపై సరైన అవగాహన ఉండక వెనుకడుగు వేస్తుంటారు. ఇక్కడ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, పోస్టాఫీస్ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇలా చాలానే ఉంటాయి. ఇక్కడ స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటివి రిస్క్‌తో కూడుకున్నవి. పోస్టాఫీస్ పథకాలు, కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ ఎలాంటి రిస్క్ లేకుండా కచ్చితమైన రిటర్న్స్ అందిస్తుంటాయి. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్స్ కూడా ఇలానే. నిర్దిష్ట వడ్డీ రేట్ల ప్రకారం.. నిర్దిష్ట కాల పరిమితికి రాబడి వస్తుంది. ఇంకా గోల్డ్, రియల్ ఎస్టేట్ అనేవి అనిశ్చితితో కూడుకున్నవి. రిస్క్ ఉన్నా.. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ అనేవి లాంగ్ రన్‌లో మంచి రిటర్న్స్ అందిస్తుంటాయని నిపుణులు చెబుతుంటారు. ఇక్కడ కూడా స్టాక్ మార్కెట్లలో నేరుగా రిస్క్ ఉంటే.. మ్యూచువల్ ఫండ్లలో కాస్త తక్కువ రిస్క్ ఉంటుంది. ఇక్కడ సిప్ లేదా లంప్ సమ్ రూపంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయొచ్చు. చాలా చిన్న మొత్తాల్లోనూ పెట్టుబడులు చేయొచ్చు. మరీ ముఖ్యంగా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ కారణంగా సంపద కాలం గడుస్తున్న కొద్దీ పెరుగుతుంటుంది. అందుకే మ్యూచువల్ ఫండ్లలో దీర్ఘకాలంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. Best SIP Schemes for 5 Years: ఇప్పుడు మనం ఐదేళ్ల వ్యవధిలో మంచి రాబడి అందించిన టాప్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. వాల్యూ రీసెర్చ్ ప్రకారం.. ఎస్బీఐ గోల్డ్ ఫండ్, క్వాంటమ్ గోల్డ్ సేవింగ్స్ ఫండ్, యాక్సిస్ గోల్డ్ ఫండ్ ఐదేళ్ల వ్యవధికి సిప్ పెట్టుబడుల్లో టాప్‌లో నిలిచాయి. ఇవి వరుసగా వార్షిక ప్రాతిపదికన సగటున 34.86 శాతం, 34.84 శాతం, 34.47 శాతం రిటర్న్స్ ఇచ్చాయి. ఇక్కడ రూ. 10 వేల సిప్ చొప్పున ఇన్వెస్ట్ చేసిన వారికి వరుసగా రూ. 13.77 లక్షల నుంచి రూ. 13.89 లక్షల వరకు రాబడి వచ్చింది. అంటే దాదాపు రూ. 14 లక్షల మేర వచ్చిందన్నమాట. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ భారత్ 22 ఎఫ్ఓఎఫ్ 21.60 శాతం XIRR రిటర్న్స్ ఇవ్వగా.. రూ. 10 వేల సిప్‌తో ఇక్కడ ఐదేళ్లకు రూ. 10.18 లక్షలు వచ్చాయి. డీఎస్పీ ఇండియా టైగర్ ఫండ్, ఎల్ఐసీ ఎంఎఫ్ ఇన్‌ఫాస్ట్రక్చర్ ఫండ్ 21.38 శాతం, 21.04 శాతం చొప్పున రాబడి అందించగా.. రూ. 10 వేల సిప్‌ను వరుసగా రూ. 10.13 లక్షలు, రూ. 10.04 లక్షలుగా మలిచాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ ఫండ్ 20.02 శాతం XIRR రిటర్న్స్ ఇవ్వగా.. ఇక్కడ రూ. 10 వేల సిప్ కాస్తా రూ. 9.80 లక్షలుగా మారింది.వీటితో పాటు రూ. 10 వేల సిప్ చేసిన వారికి ఐదేళ్లలో బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్‌లో రూ. 9.78 లక్షలు, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫార్మా హెల్త్‌కేర్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఫండ్‌లో 9.76 లక్షలు వచ్చాయి. క్వాంట్ మల్టీ అసెట్ అలోకేషన్ ఫండ్ రూ. 10 వేల సిప్‌ను రూ. 9.69 లక్షలుగా మలిచింది.