తెలంగాణలోనే కాకుండా యావత్ ఇప్పుడు తెలంగాణ రాజకీయ పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి కారణం అవుతోంది. ఈ కేసులో బండి భగీరథ్‌ను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కాపాడుతున్నాయంటూ.. బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలె బండి భగీరథ్ కేసుపై స్పందించిన ముఖ్యమంత్రి .. తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ కేసులో మైనర్ బాలికను అడ్డుపెట్టుకుని కేటీఆర్ రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.ఈ కేసులో చెబుతుండగా.. తామే అరెస్ట్ చేశామంటూ పోలీసులు ప్రకటించారు. దీంతో అసలు బండి భగీరథ్ అరెస్ట్‌కు సంబంధించి గత కొన్ని రోజులుగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. పోక్సో కేసులో బండి భగీరథ్‌ను బండి సంజయ్ అప్పగించలేదని.. స్పష్టం చేశారు. బండి భగీరథ్‍పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు పద్దతి ప్రకారం దర్యాప్తు చేస్తున్నారని ఫిర్యాదు వచ్చిన వెంటనే భగీరథ్ కేసులో చర్యలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భగీరథ్ లొంగిపోలేదని పోలీసులు అతడిని అరెస్టు చేశారని స్పష్టం చేశారు. తనిఖీల్లో బండి భగీరథ్ దొరికాడని పోలీసులు చెప్పారని నేను పోలీసుల మాటలనే నమ్ముతున్నానని చెప్పారు. గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బండి భగీరథ్‍పై నమోదైన పోక్సో కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఆగ్రహం వ్యక్తం చేశారు. విడుదల చేయవద్దని.. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఆ బాలికను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అలా చేస్తే బాధిత కుటుంబం ఎంత ఆవేదనకు గురి అవుతుందని ప్రశ్నించారు.ఇక ఈ కేసులో కేటీఆర్‌ తీరుపైనా సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బండి భగీరథ్ విషయంలో కేటీఆర్ ఒక మనిషిలా ప్రవర్తించడం లేదంటూ ఫైర్ అయ్యారు. రాజకీయాలు కావాలంటే రాజకీయంగా కొట్లాడాలని కేటీఆర్‍కు రేవంత్ రెడ్డి హితవు పలికారు. అంతే కానీ ఒక మైనర్‌ను అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఏదో సాధించామనే శాడిజం ఏంటని మండిపడ్డారు. కేటీఆర్ బావమరిది డ్రగ్స్ తీసుకున్నప్పుడు దొరికితే.. అతడ్ని అరెస్ట్ చేయాలని ఎందుకు డిమాండ్ చేయలేదని నిలదీశారు. ఆ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ కోడిపందేలు నిర్వహిస్తూ దొరికిపోయాడని.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహించి.. అక్కడికి వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపారని.. అప్పుడు కేటీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. చట్టానికి గౌరవం ఇస్తామని చెప్తున్న కేటీఆర్.. వారిని ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని నిలదీశారు. బండి భగీరథ్ కేసులో చట్ట ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం నడుచుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. బండి భగీరథ్ కేసు చాలా సెన్సిటివ్ కేసని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఈ కేసులోని సెక్షన్లు, అరెస్ట్, రిమాండ్, కోర్టులో ప్రభుత్వం తరఫున చేసిన వాదనల్లో ఎక్కడైనా లోపం ఉందా అని ప్రశ్నించారు. కేటీఆర్‌కు బండి సంజయ్‌కి మధ్య ఏదో పంచాయతీ ఉందని.. దాన్ని పిల్లల మీద పెట్టి.. పగ సాధించాలనుకుంటే ఎలా అని ప్రశ్నించారు.