. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు దాదాపు ముగుస్తున్నా ఇప్పటి వరకు ఏ జట్టు కూడా ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకోలేదు. ప్లే ఆఫ్స్‌‌లో అడుగుపెట్టాలంటే 16 పాయింట్లు కచ్చితంగా రావాలి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు 16 పాయింట్లతో ఉన్నప్పటికీ ప్లే ఆఫ్స్ బెర్త్‌లు కన్ఫార్మ్‌ కాలేదు. దాంతో 8 జట్లకూ ఇప్పటికీ ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో ఎనిమిది స్థానాల్లో ఉన్న జట్లు 11 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ 11 మ్యాచ్‌లు పూర్తయిన తర్వాతే ప్లే ఆఫ్స్‌లో ఆడే ఆ నాలుగు జట్లు ఏవి అనేది కన్ఫార్మ్ అవుతాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ప్లే ఆఫ్స్ కోసం పోటీపడుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్లక్నో సూపర్ జెయింట్స్ మీద ఓడిన చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇప్పటికీ ఛాన్స్ ఉంది. కాకపోతే ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న సీఎస్కే తన చివరి రెండు మ్యాచ్‌లలో గెలవాలి. అప్పుడే 16 పాయింట్లు అందుకోగలదు. పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తమ తమ రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోతే సీఎస్కేకి 14 పాయింట్లు వచ్చినా ప్లే ఆఫ్స్‌కి క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. సీఎస్కే తన మిగిలిన రెండు మ్యాచ్‌లను సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. గుజరాత్ టైటాన్స్గుజరాత్ టైటాన్స్ 12 మ్యాచ్‌లలో ఆడి 16 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. గుజరాత్ తన ఆఖరి ఐదు మ్యాచ్‌లలో ఓటమి ఎరుగకుండా ముందుకు సాగుతోంది. గుజరాత్ తన చివరి రెండు మ్యాచ్‌లలో ఒక్కటి గెలిచినా టాప్ 4లో కచ్చితంగా ఉంటుంది. గుజరాత్ తన చివరి రెండు మ్యాచ్‌లను కోల్‌కతా, సీఎస్కేతో ఆడనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుఆర్సీబీ ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు 16 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన చివరి రెండు మ్యాచ్‌లలో ఒకటి గెలిస్తే ప్లే ఆప్స్ బెర్త్ కన్ఫార్మ్ అయినట్టే. ఎందుకంటే టాప్ 4లో నిలిచే ఏ జట్టు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో 18 పాయింట్లు తెచ్చుకోవడం అసాధ్యం. ఈ కారణంతో ఆర్సీబీ ఒక్క మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్‌కి వెళ్లినట్టే. ఆర్సీబీ తన చివరి రెండు మ్యాచ్‌లను పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ సన్‌రైజర్స్ ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడి 14 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, రాజస్థాన్, పంజాబ్ కింగ్స్ జట్లు 16కి పైగా పాయింట్లు సాధిస్తే సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌కి క్వాలిపై అవ్వాలంటే కచ్చితంగా చివరి రెండు మ్యాచ్‌లలో గెలవాల్సిందే. ఒకవేళ పంజాబ్, రాజస్థాన్ తమ చివరి మ్యాచ్‌లలో ఓడిపోతే ఎస్ఆర్‌హెచ్‌ 14 పాయింట్లు ఉన్నా నెట్ రన్‌రేట్‌తో ప్లే ఆఫ్స్‌కి వెళ్తుంది. సన్‌రైజర్స్ తన చివరి రెండు మ్యాచ్‌లు సీఎస్కే, ఆర్సీబీతో ఆడనుంది. పంజాబ్ కింగ్స్తొలి ఏడు మ్యాచ్‌లలో ఓటమి ఎరుగని పంజాబ్ కింగ్స్.. వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ప్రస్తుతం 12 మ్యాచ్‌లలో 13 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇలాంటి సందర్భంలో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కి వెళ్లాలంటే తన చివరి రెండు మ్యాచ్‌లలో కచ్చితంగా గెలవాల్సిందే. పంజాబ్ ఆఖరి రెండు మ్యాచ్‌లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. రాజస్థాన్ రాయల్స్ రాజస్థాన్ రాయల్స్ 11 మ్యాచ్‌లలో 12 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆఖరి 7 మ్యాచ్‌లలో ఐదు ఓడిన రాజస్థాన్ తన చివరి మూడు మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ మూడు మ్యాచ్‌లూ టేబుల్ బాటమ్‌లో ఉన్న నాలుగు జట్లతో ఆడనుంది. అందులో రెండు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యాయి. రాజస్థాన్ తన చివరి మూడు మ్యాచ్‌లను ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో, ముంబైతో ఆడనుంది. కోల్‌కతా, ఢిల్లీకోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్లే ఆఫ్స్ చేరుకోవడం దాదాపు అసాధ్యమే, కానీ ఛాన్స్ ఉంది. 11 మ్యాచ్‌లు ఆడిన కేకేఆర్ 9 పాయింట్లతో ఉంది. తన చివరి మూడు మ్యాచ్‌లలో గెలిచినా 15 పాయింట్లు మాత్రమే వస్తాయి. ఇలాంటి సందర్భంలో గుజరాత్, ఆర్సీబీ, సన్‌రైజర్స్, పంజాబ్, రాజస్థాన్, సీఎస్కే కూడా 15 పాయింట్లతో ఉంటేనే కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లగలదు. ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్‌లు ఆడి 10 పాయింట్లతో కొనసాగుతోంది. రాజస్థాన్, కేకేఆర్‌తో చివరి రెండు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ రెండు గెలిచినా 14 పాయింట్లు మాత్రమే రాగలవు. ఇలాంటి సందర్భంలో ఢిల్లీ ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే ఈ రెండు మ్యాచ్‌లలో భారీగా గెలిచి నెట్ రన్‌రేట్‌ని పెంచుకోవడంతో పాటు.. ప్రస్తుతానికి టాప్ 4లో ఉన్న జట్లు ఇక ఏ మ్యాచ్‌లో కూడా గెలవకుండా ఓడిపోతూనే ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో మాత్రమే ఢిల్లీ ప్లే ఆఫ్స్‌కు చేరుకోగలదు.