లక్నో సూపర్ జెయింట్స్‌తో ఓటమి తర్వాత చాలా తగ్గిపోయాయి. అప్పటి వరకు 47 శాతం వరకు ఉన్న అవకాశాలు.. ఆ ఓటమితో ఒక్కసారిగా 28 శాతానికి పడిపోయాయి. అంటే ఇకపై సీఎస్కే‌కు ఇక దినదిన గండమనే చెప్పొచ్చు. దాదాపు ప్లే ఆఫ్స్‌లో నాలుగో స్థానం రేసు పంజాబ్ కింగ్స్ - రాజస్థాన్ రాయల్స్ మధ్యే జరిగే అవకాశం ఉంది. ఇకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి లక్నో సూపర్ జెయింట్స్ షాక్ ఇచ్చింది. చెపాక్‌లో లక్నోని ఓడిపోగా.. ఇకానాలో ఓడిపోయింది. మ్యాచ్‌తో పాటు ప్లే ఆఫ్స్ ఛాన్స్‌లనూ సీఎస్కే పోగొట్టుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ కార్తీక్ శర్మ 71 పరుగులతో రాణించడంతో 20 ఓవర్లలో 187/5 పరుగులు చేసింది. హోం గ్రౌండ్‌లో లక్నో బ్యాటర్లు ఊచకోత కోశారు. మార్ష్ 90, పూరన్ 32 పరుగులు చేయడంతో 16.4 ఓవర్లలోనే 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ తర్వాత సీఎస్కే పాయింట్ల పట్టికలో ఆరో స్థానానికి పడిపోయింది. 12 మ్యాచ్‌లు ఆడిన సీఎస్కే 12 పాయింట్లతో ఉంది. ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాలంటే చెన్నై సూపర్ కింగ్స్‌ తన మిగిలిన రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించాలి. సీఎస్కే తన మిగతా రెండు మ్యాచ్‌లలో ఒకటి సన్‌రైజర్స్ హైదరాబాద్‌, మరొకటి గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఇక ప్లే ఆఫ్స్‌కి వెళ్లే జట్ల అవకాశాలను ఒకసారి పరిశీలిస్తే.. గుజరాత్ టైటాన్స్‌కు 98 శాతం ఛాన్స్ ఉండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 96.1 శాతం ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 70.3 శాతం, పంజాబ్ కింగ్స్‌కు 48.8 శాతం, రాజస్థాన్ రాయల్స్‌కు 51.6 శాతంగా ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్‌కి 28.4 శాతం మాత్రమే ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 3.1 శాతం, కోల్‌కత్ నైట్ రైడర్స్ 3.6 శాతంతో అతి తక్కువ ఛాన్స్‌లు కలిగి ఉంది.