వచ్చాయి. కేవలం పాయింట్ల పట్టికే కాదు . బాటమ్ ప్లేస్ నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన ఇప్పటి మళ్లీ ఒక్కో స్థానం దిగుతూ పతనాన్ని చూస్తోంది. ఇదే సమయంలో కనీసం మ్యాచ్ కూడా ఆడకుండా పాయింట్ల పట్టికలో ఒక స్థానం ఎగబాకింది. ఇకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. ఇకానాలో 180కి పైగా టార్గెట్ అంటే ఆచితూచి ఆడతారు. అలాంటిది లక్నో ఓపెనర్లు సీఎస్కే బౌలర్లను ఊచకోత కోశారు. సీఎస్కే బౌలర్లు విఫలమవ్వడంతో 188 పరుగుల లక్ష్యాన్ని లక్నో 16.4 ఓవర్లలోనే ఛేదించింది. దాంతో సీఎస్కే నెట్ రన్‌రేట్ దిగజారింది. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ రెండు జట్లూ 12 పాయింట్ల సరిసమానంగా ఉన్నా.. మొన్నటి వరకు సీఎస్కే అత్యధిక రన్‌రేట్‌తో ఉంది. దాంతో రాజస్థాన్‌ను దాటేసి ఐదో స్థానంలో చాలా రోజుల పాటు ఉంది. కానీ, లక్నో మ్యాచ్‌లో ఘోర ఓటమితో సీఎస్కే ఒక్కసారిగా నెట్ రన్‌రేట్ కోల్పోయింది. దాంతో రాజస్థాన్ రాయల్స్ ఐదో స్థానానికి రాగా, చెన్నై సూపర్ కింగ్స్ ఆరో స్థానానికి పడిపోయింది. రాజస్థాన్ +0.082తో ఉండగా, సీఎస్కే +0.027తో ఉంది. పాయింట్ల టేబుల్స్ టాప్ ప్లేస్‌లో ఆర్సీబీ కొనసాగుతుండగా, గుజరాత్ టైటాన్స్ రెండో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మూడు, గుజరాత్ టైటాన్స్ జట్లు నాలుగో స్థానంలో ఉంది. అన్ని జట్లు 12 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నా ఇప్పటి వరకు ఏదీ కూడా ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకోలేదు. ఇక రాజస్థాన్ ఐదు, సీఎస్కే ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఏడు, కోల్‌కతా నైట్ రైడర్స్ 8వ స్థానంలో ఉన్నాయి. ఈ 8 జట్లు ఇంకా ప్లే ఆఫ్స్ రేసులో ఉండగా.. 9, 10 స్థానాల్లో ఉన్న ముంబై, లక్నో ఇప్పటికే సీజన్ నుంచి ఎలిమినేట్ అయ్యాయి.