PBKS vs RCB: ఐపీఎల్‌లోనే హై ఓల్టేజ్ మ్యాచ్.. ఆర్సీబీ గెలిస్తే ప్లే ఆఫ్స్‌కి, పంజాబ్ ఓడితే ఇంటికే!

Wait 5 sec.

డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఐపీఎల్ 2025 రన్నరప్ పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో తొలిసారి తలపడనున్నాయి. ఐపీఎల్ 2026లో ఇరు జట్ల మధ్య ఒకే ఒక మ్యాచ్ ఉండటం.. అది కూడా ప్లే ఆఫ్స్‌కు దగ్గరవుతున్న సమయంలో ఉండటంతో హై ఓల్టేజ్ గ్యారెంటీ అని క్రికెట్ నిపుణులు అంటున్నారు. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కావడంతో నువ్వా - నేనా అన్నట్టు సాగడం ఖాయంలా కనిపిస్తోంది. ఐపీఎల్ 2026లో భాగంగా 61వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ధర్మశాల వేదికగా జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిన పంజాబ్ కింగ్స్‌కు ఈ మ్యాచ్ చావో రేవో అన్నట్టు మారింది. ప్లే ఆఫ్స్ బరిలో నిలవాలంటే పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ఈ సీజన్ ఆరంభంలో తొలి ఏడు మ్యాచ్‌లలో ఒక్క ఓటమి కూడా ఎదురుకోని పంజాబ్ కింగ్స్.. ఆ తర్వాత జరిగిన ఐదు మ్యాచ్‌లలో వరుసగా ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. 12 మ్యాచ్‌లలో 13 పాయింట్లు సాధించిన పంజాబ్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాలంటే ఆఖరి రెండు మ్యాచ్‌లలో గెలిచి తీరాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సేఫ్ జోన్‌లోనే ఉంది. 12 మ్యాచ్‌లలో 8 గెలిచి 16 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. ధర్మశాల వేదికగా పంజాబ్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టడమే కాకుండా, టాప్ 2 ప్లేస్‌ని కూడా ఫిక్స్ చేసుకోనుంది. దాంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకంగా మారింది. పంజాబ్ కింగ్స్ జట్టు అంచనాప్రియాన్షు ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, కూపర్ కాన్‌లీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), సుర్యాన్షు షెడ్జే, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయీ, మార్కో యాన్సన్, హర్‌ప్రీత్ బ్రార్, లాకీ ఫెర్గ్యూసన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అంచనాజేకబ్ బెతెల్, విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పటిదార్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, జితేశ్ శర్మ, వెంకటేశ్ అయ్యర్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రసిక్ సలామ్ దార్, జేకబ్ డప్ఫీ, జోష్ హేజిల్‌వుడ్.