48 గంటల్లోనే మరోసారి షాకిచ్చిన కేంద్రం.. సీఎన్‌జీ ధర మళ్లీ పెంపు.. కిలోకు ఎంత పెరిగిందంటే?

Wait 5 sec.

Price Hike: వాహనదారులకు కేంద్రం మరోసారి షాకిచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) గ్యాస్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. అయితే, ధరలు పెంచిన 48 గంటల్లోనే మరోసారి షాక్ ఇచ్చింది. సీఎన్‌జీ గ్యాస్ ధరలను మరోసారి పెంచుతూ ఆదివారం ప్రకటన చేసింది. కిలో సీఎన్‌జీ గ్యాస్ పై రూ. 1 మేర పెంచుతున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే మళ్లీ ధరలను పెంచడం గమనార్హం. ఇది సీఎన్‌జీ కార్లు, ఆటోలు ఉపయోగిస్తున్న వారికి అదనపు భారంగా మారనుంది. మరి ఏ ప్రాంతంలో కేజీ సీఎన్‌జీ ధర ఎంత మేర పెరిగిందో తెలుసుకుందాం.రెండు రోజుల వ్యవధిలోనే సీఎన్‌జీ గ్యాస్ ధర రెండు సార్లు పెంచడం గమనార్హం. దీంతో కేజీ సీఎన్‌జీపై రూ. 2, రూ. 1 చొప్పున అంటే రూ. 3 మేర ధర పెంచారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు కిలో సీఎన్‌జీ ధర రూ. 80.09కు చేరింది. అలాగే ఉత్తర్ ప్రదేశ్‌లోని నోయిడా, ఘాజియాబాద్‌లో రూ. 88.70కి చేరింది. అలాగే హైదరాబాద్‌లో కేజీ సీఎన్‌జీ రేటు రూ. 99 వద్ద ఉంది. అయితే భాగ్యనరంలో ధరలు పెరగలేదు. బెంగళూరులో కిలో సీఎన్‌జీ ధర రూ. 90.10 వద్ద ఉంది. కోల్‌కతాలో కిలో సీఎన్‌జీ గ్యాస్ రేటు రూ. 94 వద్ద అమ్ముడవుతోంది. ఆధారిత దేశాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు రికార్డ్ స్థాయికి చేరుకోవడంతో ఆ ప్రభావం చాలా రంగాలపై కనబడుతోంది. ఇంధన ధరలతో ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. యుద్ధం మొదలై రెండున్నర నెలలు అయినా ఇన్నాళ్లు నష్టాలను భరిస్తూ వచ్చాయి. అయితే, ఇకపై ఆ నష్టాలను భరించలేని స్థితి ఏర్పడింది. చమురు కంపెనీలపై ఉన్న ఆర్థిక ఒత్తిళ్లు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. లీటర్ పెట్రోలు, లీటర్ డీజిల్ పై సగటున రూ.3 వరకు ధర పెంచింది. అలాగే సీఎన్‌జీ రేట్లు పెంచింది. మహానగర్ గ్యాస్ లిమిటెడ్ మే 14 నుంచే పెంచిన సీఎన్‌జీ ధరలను అమలులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా సీఎన్‌జీ ధరలు పెరగడం వాహనదారులపై అదనపు భారం పడేలా చేసింది.