Rupee Value Today: దేశీయ కరెన్సీ రూపాయి విలువ రోజు రోజుకూ పాతాళానికి పడిపోతోంది. డాలర్ దెబ్బకు కుప్పకూలుతోంది. దీంతో ఈ పతనానికి అడ్డుకట్ట వేసేందుకు () రంగంలోకి దిగింది. బ్యాంకింగ్ వయ్వస్థలోకి నగదు లక్ష్యతను పెంచాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఇందుకోసం 5 బిలియన్ డాలర్ల విలువైన డాలర్- రూపాయి బై, సెల్ స్వాప్ వేలం నిర్వహిస్తామని వెల్లడించింది. ఈ వేలం ప్రక్రియను మే 26, 2026 రోజున నిర్వహించనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, చమురు ధరల పెరుగుదల వంటివి ఈ నేపథ్యంలో అడ్డుకట్ట వేసేందుకు ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత, మారుతున్న పరిస్థితుల్లో సమీక్షించాక 3 సంవత్సరాల కాల పరిమితితో యూఎస్‌డీ- ఐఎన్ఆర్ బై లేదా సెల్ స్వాప్ వేలాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు రిజర్వ్ బ్యాంక్ తన సర్క్యులర్‌లో పేర్కొంది. అయితే ఈ స్వాప్ అంటే ఏంటి? అని చాలా మంది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మార్కెట్లో నగదు లభ్యతను పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు బై లేదా సెల్ స్వాప్ విధానాన్ని అనుసరిస్తుంటుంది. ఈ విధానంలో వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉన్న డాలర్లను రిజర్వ్ బ్యాంక్‌కు విక్రయించి, దానికి సమానమైన రూపాయిలను పొందుతాయి. 3 ఏళ్ల గడువు ముగిసిన తర్వాత అదే మొత్తంలో డాలర్లను ముందే నిర్దేశించిన ప్రీమియం ధరతో తిరిగి కొనుగోలు చేసేందుకు బ్యాంకులు ఒప్పందం చేసుకుంటాయి. దీంతో రూపాయి పతనం ఆగుతుంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, ఇరాన్-అమెరికా యుద్ధం, ముడి చమురు ధరల పెరుగుదల వంటి వాటి వల్ల రూపాయి విలువ రికార్డు స్థాయిలో బలహీనపడుతోంది. ఈ నేపథ్యంలో మరింత పడిపోకుండా ఈ స్వాప్ తోడ్పడుతుంది. కనీస బిడ్ సైజ్ 10 మిలియన్ డాలర్లుగా రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. ప్రస్తుతం 1 డాలర్ విలువ రూ.96.707 స్థాయి వద్ద ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. రోజు రోజుకు సరికొత్త కనిష్ఠ స్థాయిని నమోదు చేస్తూ రూ.100 స్థాయి వైపు వెళ్తుండడం ఆందోళన కలిగిస్తోంది. రూపాయి విలువ పడిపోవడంతో మన విదేశీ మారకం నిల్వలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర తగ్గినా దేశీయంగా పెరగడమూ మీరు గమనిస్తూనే ఉన్నారు. ఇలాగ రూపాయి పడిపోవడంతో అందాల్సిన ప్రయోజనాలు సైతం కోల్పోవాల్సి వస్తోంది.