హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ డ్రాగన్. టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచే ఈ సినిమా రికార్డుల వేట ప్రారంభించింది. తారక్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం రాత్రి డ్రాగన్ ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 4 నిమిషాల 28 సెక‌న్ల ఈ వీడియో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసింది.‘డ్రాగన్‌’ గ్లింప్స్‌ 24 గంటల్లోనే 64 మిలియన్లకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పటివరకూ ఇండియన్ సినిమాలో ఏ గ్లింప్స్‌కు ఇంత తక్కువ సమయంలో ఇన్ని వ్యూస్‌ రాలేదని, ఇది ఆల్‌ టైం రికార్డ్ అంటూ పోస్టర్‌ విడుదల చేసింది. డ్రాగన్ ర్యాంపేజ్ మొదలైందని, డ్రాగన్ నుంచి రికార్డులు ఎప్పుడూ సురక్షితంగా ఉండవని పేర్కొంది. హిస్టరీ.. హిస్టీరియా.. 24 గంటల్లో రికార్డులను తిరగరాసిందని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.‘ఎన్టీఆర్‌ నీల్’ మూవీ అప్‌డేట్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ‘డ్రాగ‌న్‌’ టైటిల్ ను ఖరారు చేస్తూ, గ్లింప్స్ వదిలారు. ఇది 1967 నేపథ్యంలో నడిచే చీకటి ప్రపంచాన్ని, అందులోని పాత్రలను పరిచయం చేసింది. గోల్డెన్ ట్రైయాంగిల్ ప్రాంతంలోని ఓపియం (నల్లమందు) అక్రమ వ్యాపారం, అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీకి చెందిన భ‌యంక‌ర‌మైన‌ క్రూర‌మైన విల‌న్స్‌ను ఆవిష్కరించింది. అందులో లూగర్ అనే విలన్ పాత్రలో.. అఫ్గాన్ ట్రేడింగ్ కంపెనీ అస్సాసిన్-ఇన్-చీఫ్ (ప్రధాన హంతకుడు)గా కొత్త అవతారంలో ఎన్టీఆర్ కనిపించారు.‘పొరపాటున కూడా నా కలలోకి రావొద్దు’ అంటూ ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్, ఆయన స్క్రీన్‌ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఎన్నడూ చూడని విధంగా, సిక్స్‌ప్యాక్ అబ్స్‌తో సన్నగా డిఫ‌రెంట్‌ లుక్‌లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఒక షాట్ లో ఆయన శ‌వాల గుట్ట మధ్య నిలబడి ఉండటం లూగర్ పాత్ర‌లోని ఇంటెన్సిటీని తెలియ‌జేస్తోంది. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ న‌టుడు అనీల్ క‌పూర్ కీలక పాత్ర పోషించారు. బిజూ మీన‌న్‌, ఖుష్బూ సుంద‌ర్‌, గురు సోమ‌సుంద‌రం, రాజీవ్ క‌న‌కాల‌, అశుతోష్ రానా, అన్షుమ‌న్ పుష్క‌ర్‌, సిద్ధాంత్ గుప్తా, ప్ర‌భాస్ శ్రీను, శ‌త్రు, శివ, భీమ‌ల్ జీత్ ఒబెరాయ్ త‌దిత‌రులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి భువ‌న్ గౌడ్ సినిమాటోగ్ర‌ఫీ నిర్వహిస్తుండగా, ర‌వి బ‌స్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. చ‌ల‌ప‌తి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై క‌ళ్యాణ్ రామ్ నంద‌మూరి, న‌వీన్ ఎర్నేని, ర‌వి శంక‌ర్ య‌ల‌మంచిలి, హ‌రికృష్ణ కొస‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి రెడీ చేస్తున్నారు.