ఏపీకి రూ.96 వేల కోట్లతో మరో భారీ పరిశ్రమ.. 6,042 ఎకరాల్లో, భారీగా ప్రోత్సాహకాలు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలు, కంపెనీలు క్యూకట్టాయి. మిట్టల్ స్టీల్, గూగుల్ డేటా సెంటర్, యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్ట్ సహా ఎన్నో పెట్టుబడులు వచ్చాయి. వీటితో పాటుగా ఏపీకి బీపీసీఎల్‌ (భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్) పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌, గ్రీన్‌ఫీల్డ్‌ ఆయిల్‌ రిఫైనరీ కూడా ఏర్పాటు కాబోతోంది. నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో ఈ కాంప్లెక్స్, రిఫైనరీ ఏర్పాటు చేయనుండగా.. తాజగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం6,042.46 ఎకరాలు బీపీసీఎల్‌కు బదిలీ చేసేందుకు ఓకే చెప్పింది.. ఈ మేరకు ప్రభుత్వం సవరించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఈ భూమి బదిలీకి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల్ని మినహాయిస్తూ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల డైరెక్టర్లను ఆదేశించింది ప్రభుత్వం.నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్ట్ సమీపంలోనేతో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌, గ్రీన్‌ఫీల్డ్‌ ఆయిల్‌ రిఫైనరీ ఏర్పాటు చేస్తోంది. బీపీసీఎల్ భారీగా పెట్టుబడులు పెడుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ కోసం ముందు 6వేల ఎకరాలను కేటాయించగా.. తాజాగా 6,042 ఎకరాలను వ్యయ ప్రాతిపదికన బీపీసీఎల్‌కు బదిలీ చేసేందుకు సవరించిన ఉత్తర్వులు జారీ చేసింది. బీపీసీఎల్‌కు భూముల బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత శాఖల్ని ఆదేశించారు. మొత్తం 6,042 ఎకరాలకు సంబంధించి స్టాంప్‌ డ్యూటీ కింద రూ.127.68 కోట్లు, రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద రూ.19.64 కోట్ల మినహాయింపు ఇచ్చారు. మొత్తం రూ.147.33 కోట్లకు పైగా బీపీసీఎల్‌కు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.బీపీసీఎల్‌కు ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు 480.89 ఎకరాలను బదిలీకి సంబంధించి ప్రతిపాదనలు పంపాలని రెండు జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బీపీసీఎల్‌కు కేటాయిస్తున్న 6,042 ఎకరాల భూసేకరణ ప్రక్రియ తర్వాత పట్టా భూముల మ్యూటేషన్‌‌కు చర్యలు తీసుకోవాలని రెండు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ఏపీఐఐసీ, ఏపీ మ్యారీటైం బోర్డు, రాష్ట్ర పరిశ్రమల శాఖతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మొత్తం మీద బీపీసీఎల్ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక ముందడుగు పడింది. త్వరలోనే శంకుస్థాపన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.