ఇన్వెస్టర్లకు అదిరిపోయే శుభవార్త.. కోల్‌ ఇండియా నుంచి మరో అతిపెద్ద ఐపీఓ.. 25 శాతం వాటా విక్రయం!

Wait 5 sec.

Dates: మీరు స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారా.? మరి ఇక్కడ మీకు ఐపీఓల గురించి తెలిసే ఉంటుంది. చాలా మంది వీటిల్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఐపీఓలు చాలా వరకు లిస్టింగ్ గెయిన్స్ అధికంగా అందిస్తుంటాయి. ఏదైనా కంపెనీ తొలిసారిగా షేర్ల విక్రయం ద్వారా స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ కావడాన్ని ఐపీఓగా చెబుతుంటారు. ఇక్కడ నిర్దిష్ట ధరకు షేర్లను విక్రయిస్తారు. నిర్దిష్ట సమయంలో బిడ్డింగ్స్ చేయాల్సి వస్తుంది. అందులో షేర్లు అలాట్ అయిన వారికి మంచి లాభాలు అందే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఐపీఓలు లిస్టింగ్‌తో లాభాల్నే అందిస్తుంటాయి. వీటిని సబ‌స్క్రైబ్ చేసుకునేందుకు కూడా జనం ఎగబడుతుంటారు. అందుబాటులో ఉన్న షేర్లకు ఎన్నో రెట్ల మేర బిడ్స్ దాఖలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి మరో శుభవార్త అందింది. తన సబ్సిడరీ మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఐపీఓకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో అతి త్వరలోనే ఇది స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ కానుందని చెప్పొచ్చు. Mahanadi Coalfields IPO:మహానది కోల్‌ఫీల్డ్స్ ఐపీఓలో భాగంగా.. కోల్ ఇండియా తన వాటాలో 25 శాతం వరకు వాటాను విక్రయించనుంది. ఇక్కడ ఐపీఓలో కోల్ ఇండియా తన వద్ద ఉన్న పాత షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS0 పద్ధతిలో విక్రయించనుండటంతో పాటుగా మహానది కోల్‌ఫీల్డ్స్ కూడా తన భవిష్యత్తు అవసరాల కోసం కొత్త షేర్లను (ఫ్రెష్ ఈక్విటీ) కూడా జారీ చేయనుంది. ఇక కోల్ ఇండియా లాభాల్లో దాదాపు 30 శాతం వరకు లాభం మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచే వస్తుందని చెప్పొచ్చు. ఇది ఒడిశా పరిధిలో పనిచేస్తుంది. కాబట్టి.. ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఇది అతిపెద్ద ఐపీఓల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కంపెనీ త్వరలోనే సెబీకి డ్రాఫ్ట్ పేపర్స్ సమర్పించి.. ప్రాసెస్ ప్రారంభించనుంది. అప్పుడే నిధుల సమీకరణ, సబ్‌స్క్రిప్షన్, లిస్టింగ్ తేదీలు ఖరారు కానున్నాయి. కోల్ ఇండియా నుంచి వరుస ఐపీఓలు..ప్రభుత్వ దిగ్గజ సంస్థ కోల్ ఇండియా నుంచి వరుసగా ఐపీఓలు రాబోతున్నాయని చెప్పొచ్చు. 2030 నాటికి కోల్ ఇండియా తన మొత్తం 8 అనుబంధ సంస్థల్ని స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఐపీఓలు వచ్చాయి. వీటికి మంచి స్పందన కూడా లభించింది. ఇప్పుడు మహానది సంస్థకు కూడా గ్రీన్ సిగ్నల్ రాగా.. సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్, వెస్టర్న్, ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఐపీఓలు కూడా రాబోయే నాలుగేళ్లలో రానున్నాయి.