పవర్ ప్లేలోనే మ్యాచ్‌పై ఆశలు గల్లంతయ్యాయి. ముఖ్యంగా బౌలింగ్‌లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఏ బాల్ ఫోర్ పోతుందో, ఏ బాల్ సిక్సర్ వెళ్తుందో కూడా అర్థం కాలేదు. తొలి ఓవర్‌లో 11 పరుగులు మాత్రమే ఇచ్చిన కాంబోజ్.. ఆ తర్వాత వరుస సిక్సర్లు సమర్పించుకుని ఓటమికి ప్రధాన కారణమయ్యాడు. ఇకానా పిచ్ బ్యాటింగ్‌కి అంత అనుకూలించలేదు. తొలుత బౌలింగ్ చేసిన లక్నో సీఎస్కేను ఇరకాటంలో పెట్టింది. ఆఖరి ఓవర్‌లో దూబే సిక్సర్ల వర్షం కురిపించడంతో 187 పరుగులైన చేసిందిగానీ, లేకపోతే 160లోపే ఆగిపోయేది. లక్నోకి కూడా ఇదే పరిస్థితి అని సీఎస్కే ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ, మిచెల్ మార్ష్ మాస్ అవతారానికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. సిక్సర్లు, ఫోర్లతో పవర్ ప్లేలోనే మ్యాచ్‌ని డిసైడ్ చేసేశాడు. సీఎస్కే చెత్త బౌలింగ్‌తో కేవలం 17 ఓవర్లలోనే మ్యాచ్ ముగిసిపోయింది. అన్షుల్ కాంబోజ్ వేసిన ఐదో ఓవర్, 17వ ఓవర్‌లో లక్నో బ్యాటర్లు సిక్సర్ల వర్షం కురిపించారు. ఐదో ఓవర్ తొలి నాలుగు బంతుల్లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదగా, 17వ ఓవర్‌లో కూడా మొదటి నాలుగు బంతుల్లో నాలుగు సిక్సర్లు బాది మ్యాచ్‌ని ముగించారు. 187 పరుగుల టార్గెట్‌లో అన్షుల్ కాంబోజ్ ఒక్కడే 63 పరుగులు సమర్పించుకున్నాడు. అది కూడా కేవలం 16 బంతుల్లోనే, అంటే మూడు ఓవర్లు కూడా పూర్తిగా బౌలింగ్ చేయకుండానే అన్ని పరుగులు ఇచ్చేశాడు. మూడో ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన కాంబో తొలి మూడు బంతుల్లో రెండు బౌండరీలు, ఒక త్రీడీతో 11 పరుగులు ఇవ్వగా.. ఆ తర్వాత మూడు బంతులు డాట్స్ చేశాడు. ఐదో ఓవర్‌లో మిచెల్ మార్ష్ మొదటి నాలుగు బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఆఖరి బంతికి ఫోర్ లభించింది. దాంతో ఆ ఒక్క ఓవర్‌లోనే 28 పరుగులు వచ్చాయి. మ్యాచ్ చివరి దశకు రావడం 24 బంతుల్లో 24 పరుగులు కావాల్సి రావడంతో మళ్లీ అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌కి వచ్చాడు. ఈసారి నికోలస్ పూరన్ వరుసగా నాలుగు సిక్సర్లు బాది మ్యాచ్‌ని ఫినిష్ చేశాడు. కాంబోజ్ 2.4 ఓవర్లలో 23.6 ఎకానమీతో చెత్త బౌలింగ్ వేసి సీఎస్కే ఓటమికి కారణమయ్యాడు.