3 వికెట్లు పడినా తాను బ్యాటింగ్‌కి ఎందుకు రాలేదో చెప్పి, హృదయాలు గెలుచుకున్న రిషభ్ పంత్

Wait 5 sec.

లో భాగంగా లో బ్యాటింగ్‌కి దిగలేదు. సాధారణంగా ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చే పంత్.. నికోలస్ పూరన్ కోసం ఆ స్థానాన్ని త్యాగం చేశాడు. ఆ తర్వాత సెకండ్ డౌన్, మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కి రావడం మొదలుపెట్టాడు. అయితే, సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ అవకాశం వచ్చినా ఆడలేదు. తాను ఎందుకు బ్యాటింగ్‌కి రాలేదో చెప్పి అభిమానుల హృదయాలు గెలుచుకున్నాడు. సీఎస్కేపై విజయం చాలా మంచి ఫీలింగ్ ఇచ్చిందని రిషభ్ పంత్ అన్నాడు. హోం గ్రౌండ్‌లో ఇలాంటి విజయంతో సక్సెస్ ఫార్ములాకు దగ్గరయ్యామని చెప్పాడు. హోం కండిషన్స్‌లో నలుగురు ఫాస్ట్ బౌలర్లతో ఆడటం గెలుపునకు కీలక కారణమైందన్నాడు. ఈ సీజన్‌లో తాము ఇంకా మ్యాచ్‌లు ఆడాల్సి ఉందని, మంచి ఎండింగ్ అందిస్తామన్న నమ్మకం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసుకుని ఆకట్టుకున్న ఆకాశ్ సింగ్ గురించి కూడా పంత్ మాట్లాడాడు. ఆకాశ్ సింగ్ సీజన్ మొత్తం చాలా కష్టపడ్డాడని, కొన్నిసార్లు ప్రతి ఆటగాడికి అవకాశం ఇవ్వడం కష్టంగా ఉంటుందని.. కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నాడు. ఆకాశ్ సింగ్ కోచ్‌లు చెప్పిన ప్లాన్‌ను ఫాలో అయ్యేవాడని, అదే ఈ రోజు సక్సెస్ మంత్రా అంటూ చెప్పుకొచ్చాడు. కోచ్‌లు ఏదైతే ప్లాన్ చెప్పారో అదే ప్లాన్‌తో బౌలింగ్ చేయడం చూసి చాలా సంతోషంగా అనిపించింది అన్నాడు. తాను బ్యాటింగ్ ఎందుకు చేయలేదో చెబుతూ "నేను ఎందుకు బ్యాటింగ్ చేయలేదంటే.. నేను బ్యాటింగ్‌కి రెడీగానే ఉన్నాను. కానీ డ్రెస్సింగ్ రూమ్‌లో ఒక ఆలోచన వచ్చింది. ఇప్పటి వరకు ఎక్కువ అవకాశాలు రాని ఆటగాళ్లకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో అనిపించింది. మళ్లీ మళ్లీ ఆలోచించాను. అందుకే ముందు బ్యాటింగ్‌కి రాలేదు" అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడిన లక్నో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానానికి పరిమితమైంది.