"మా లెక్క చాలా సింపుల్, నో టెన్షన్.. పరిస్థితులను మేమే తిరగరాస్తాం".. ప్లే ఆఫ్స్‌పై రుతురాజ్ బోల్డ్ స్టేట్‌మెంట్

Wait 5 sec.

ముగిసిందని అందరూ భావిస్తున్న వేళ ఆ జట్టు కెప్టెన్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. ప్లే ఆఫ్స్‌లో తమ జట్టు అడుగుపెడుతుందని, ఎలాంటి పరిస్థితుల నుంచైనా కమ్ బ్యాక్ ఇస్తామంటూ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ అనంతరం రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ ఒత్తిడికి గురవాల్సిన అవసరం లేదని, మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిస్తే చాలు అంటూ సింపుల్‌గా చెప్పాడు. మ్యాచ్ అనంతరం ప్రజంటేషన్ సమయంలో రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ అంతా బాగనే ఆడామని, కాకపోతే ఒక బ్యాడ్ డే అనుకోవాలని జట్టును సమర్థించాడు. కార్తీక్ శర్మ 70కి పైగా పరుగులు చేయడం ఆనందంగా అనిపించిందని, మిడిలార్డర్ ఇంకాస్త బలపడాల్సిన అవసరం ఉందన్నాడు. చివరి రెండు మ్యాచ్‌లకు వెళ్లే ముందు తమ బ్యాటర్లు ఫామ్‌లోకి వస్తారనే నమ్మకం వ్యక్తం చేశాడు. బౌలింగ్ కూడా బాగానే ఉందని, కాకపోతే ఇవాళ ఒక బ్యాడ్ డే మాత్రమే అన్నాడు. లక్నో పిచ్‌పై 160 - 170 పరుగులు మాత్రమే చేస్తామని అనుకున్నామని, కానీ 180 పరుగులు దాటడం సంతోషంగా ఉందని రుతురాజ్ అన్నాడు. కానీ, ప్రత్యర్థి జట్టు తమ కంటే చాలా బాగా ఆడారని.. పిచ్ సహకరించకపోయినా ఆ రేంజ్ స్కోర్‌ని చేయడంతో క్రెడిట్ మొత్తం లక్నో బ్యాటర్లకు ఇచ్చాడు. షార్ట్ బాల్స్‌ను ఎదుర్కోవడంలో సీఎస్కే విఫలమైందని, మిచెల్ మార్ష్ షార్ట్ బాల్స్ బాగా ఆడటంతో మ్యాచ్ లక్నో గెలిచిందని చెప్పుకొచ్చాడు. ఇక ప్లే ఆఫ్స్ గురించి మాట్లాడుతూ "మామొదటి ఛాలెంజ్ చెన్నై చేరుకోవడమే. ఆ తర్వాత మేం ఎక్కడ మెరుగుపడాలో చూస్తాం. పరిస్థితులకు తగ్గట్టు మారాలి. మాకు లెక్క చాలా సింపుల్.. మిగిలి ప్రతి మ్యాచ్ గెలవాలి అంతే. ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. టెన్షన్ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఆ రోజు ఎవరు బాగా ఆడతారో వారు మ్యాచ్‌ను మార్చుతారు. పరిస్థితులను మేమే తిరగరాస్తామని ఆశిస్తున్నాను" అని రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు.