'ఆ కుర్చీని మడత పెట్టి' అంటూ సోషల్ మీడియాలో ఫేమస్‌‌‌గా మారిన అలియాస్ చెందారు. హైదరాబాద్‌ కృష్ణకాంత్‌ పార్కులో మంగళవారం సాయంత్రం వాకింగ్‌ చేస్తున్న సమయంలో ఎండ దెబ్బకు ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. పార్క్‌కు వచ్చిన కొంతమంది గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు తీసుకెళ్లి పాషాకు ప్రథమ చికిత్స అందించి ఇంటికి తీసుకెళ్లారు. అయితే బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో పాషా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. భార్య ఒడిలోనే తలపెట్టి ప్రాణాలు కోల్పోయారు. వరంగల్‌ కరీమాబాద్‌కు చెందిన మహ్మద్ పాషా హైదరాబాద్‌‌లో ఉంటున్నారు.. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పాషా హైదరాబాద్‌ కృష్ణ కాంత్ పార్క్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా తిరిగేవారు. అక్కడే కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలో ఇచ్చేవారు.. అక్కడ ఓ ఇంటర్వ్యూలో కుర్చీ మడత పెట్టి డైలాగ్ చెప్పి సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయ్యారు. అలా ఆయన పేరు పాషా నుంచి కుర్చీ తాతగా మారింది.. సోషల్ మీడియాలో మీమ్స్, రీల్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇంతలో పాష కుర్చీ మడత పెట్టి డైలాగ్‌కు సినిమాలో కూడా ఛాన్స్ దక్కింది. సూపర్ స్టార్ మహేష్‌బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమాలోని పాటలో కుర్చీ తాత డైలాగ్ వాడేశారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ డైలాగ్‌ను కాస్త రీమిక్స్ చేసి పాటలో వాడేయడంతో పాషా మరింత ఫేమస్ అయ్యారు. థమన్ ఆ కుర్చీని మడతపెట్టి డైలాగ్ వాడుకున్నందుకు పాషాకు కొంత డబ్బులు కూడా ఇచ్చారు.గతంలో కుర్చీ తాత చనిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ చనిపోలేదంటూ కుటుంబసభ్యులు క్లారిటీ ఇచ్చారు.. కుర్చీతాత మీడియో ముందుకు వచ్చి తాను బతికే ఉన్నానని.. తప్పుడు ప్రచారం చేయొద్దని చెప్పారు. అప్పటి నుంచి కృష్ణకాంత్ పార్క్ దగ్గర మళ్లీ కనిపిస్తున్నారు. అయితే కుర్చీతాత అదే పార్క్ దగ్గరకు ఎండల దెబ్బకు తీవ్ర అస్వస్థతతో కన్నుమూశారు. పాషా కుటుంబానికి కొంతమంది సోషల్ మీడియా సెలబ్రిటీలు అండగా నిలిచారు.. వారికి తోచిన విధంగా సాయం అందించారు.