దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన తీసుకున్నారు. బండి భగీరథ్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు తెలంగాణ హైకోర్టులో ఆయన లాయర్ మెమో ఫైల్ చేశారు. అరెస్ట్‌కు ముందే.. ఈ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టులో దాఖలు చేయగా.. దానిపై వాదనలు విన్న ధర్మాసనం తీర్పును ఇవాళ వెల్లడిస్తామని తెలిపింది. ఈలోపే దాంతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఆ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకోనున్నారు. మరోవైపు.. ఈ పోక్సో కేసులో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే బాధిత బాలిక, ఆమె తల్లితో మాట్లాడిన సిట్ అధికారులు.. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసును విచారణ చేస్తున్నారు. అదే సమయంలో ఇక బండి భగీరథ్ ఫోన్‌ స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులకు షాక్ తగిలింది. సిమ్ కార్డు లేని ఫోన్‌ను సిట్ అధికారులకు బండి భగీరథ్ ఇవ్వగా.. అందులో సిమ్ ఏమైంది అని అడగ్గా.. ఎక్కడో పెట్టి మర్చిపోయినట్లు సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు ఎఫ్ఐఆర్‌లో మరిన్ని అదనపు సెక్షన్లను సిట్ అధికారులు యాడ్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా మరో సెక్షన్‌ను కూడా జోడించినట్లు సమాచారం. కీలక ఆధారాలను మాయం చేసినందుకుగాను బండి భగీరథ్‌పై 238 సెక్షన్‌ను యాడ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పోక్సో కేసులో కీలకంగా మారిన డిజిటల్‌ ఆధారాలను బండి భగీరథ్‌ తొలగించాడని.. గతంలో ఉపయోగించిన సెల్‌ఫోన్లు, సిమ్‌కార్డులు, ఇతర కీలక ఆధారాలను నిందితుడు మాయం చేసినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. ఇక ఈ కేసులో బండి భగీరథ్ ఆధారాలు మాయం చేసినట్లు రుజువైతే.. శిక్ష మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడిన లొంగిపోలేదని.. పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో అతడు పట్టుబడటంతో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. కానీ అంతకుముందు బుధవారం రోజున మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి చెప్పడం గమనార్హం.