3 నెలల్లోనే రూ. 5.6 లక్షల కోట్ల లాభం.. ప్రపంచంలోనే టాప్ కంపెనీ రూ. 7.70 లక్షల కోట్ల షేర్ బైబ్యాక్!

Wait 5 sec.

Nvidia Share Price: ఎన్విడియా.. ప్రస్తుతం ప్రపంచంలోనే మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అతిపెద్ద కంపెనీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ టెక్ దిగ్గజం, చిప్ మేకర్.. తాజాగా 2027 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఫలితాల్ని ప్రకటించింది. అక్కడ ఫిబ్రవరి- ఏప్రిల్ తొలి త్రైమాసికంగా ఉంటుంది. ఈ సమీక్షా త్రైమాసికంలో సంస్థ నికర లాభం రికార్డు స్థాయిలో 58.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది భారత కరెన్సీలో చూస్తే ఏకంగా రూ. 5.6 లక్షల కోట్లకుపైనే ఉంటుంది. 3 నెలల్లోనే ఈ స్థాయిలో లాభాల్ని నమోదు చేసి.. వాల్ స్ట్రీట్ అంచనాల్ని మించేసింది. తమ హై ఎండ్ ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ (AI) చిప్స్‌కు విపరీతమైన డిమాండ్ నేపథ్యంలో లాభాలు భారీగా పెరిగాయి. ఇంకా ఏఐ మౌలిక సదుపాయాల విస్తరణ కూడా వేగవంతం కావడంతో డేటా సెంటర్ విభాగం నుంచి ఆదాయం భారీగా పెరిగింది. అంతకుముందు ఇదే సమయంతో పోలిస్తే లాభం ఏకంగా మూడింతలకుపైగా పెరగడం విశేషం. అంతకుముందు ఇదే త్రైమాసికంలో లాభం కేవలం 18.8 బిలియన్ డాలర్లుగానే ఉండేది. లాభాన్ని మరో విధంగా ఒక్కో ఈక్విటీ షేరుపైనే 2.39 డాలర్ల చొప్పున ఆర్జించింది. ఇక సంస్థ ఆదాయం 81.62 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఇది భారత కరెన్సీలో చూస్తే రూ. 8.20 లక్షల కోట్లకుపైనే ఉంది. ఆదాయం కూడా ఏకంగా 85 శాతం పెరిగింది. ఎన్విడియా షేర్ ధర (Nvidia Shares)ఫలితాల్ని ప్రకటించిన నేపథ్యంలో ఎన్విడియా షేరు స్వల్పంగా 1.30 శాతం పెరిగి 223.47 యూఎస్ డాలర్ల వద్ద ఉంది. స్టాక్ ఆల్ టైమ్ హై వాల్యూ 236.54 USD గా ఉండగా.. కనిష్ఠ ధర 129.17 డాలర్లుగా ఉంది. మార్కెట్ విలువ ప్రస్తుతం 5.41 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఇది భారత కరెన్సీలో రూ. 520 లక్షల కోట్లకుపైనే ఉంటుంది. ఇది భారత జీడీపీ కంటే కూడా ఎక్కువే. ఎన్విడియా తర్వాత మార్కెట్ విలువ పరంగా టాప్ కంపెనీలుగా అల్ఫాబెట్, యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వరుసగా ఉన్నాయి. ఎన్విడియా కంపెనీకి ప్రస్తుతం ఫౌండర్, సీఈఓగా జెన్సెన్ హువాంగ్ ఉన్నారు. ఎన్విడియా షేర్ బైబ్యాక్ (Nvidia Share Buyback)మరోవైపు ఇదే సమయంలో సంస్థ.. తమ షేర్ హోల్డర్లకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. అదే షేర్ బైబ్యాక్. ఈసారి ఏకంగా 80 బిలియన్ డాలర్ల విలువైన షేర్ల బైబ్యాక్ ప్రకటించింది. ఇది భారత కరెన్సీలో సుమారు రూ. 7.70 లక్షల కోట్లుగా ఉంటుంది. షేర్ బైబ్యాక్ అంటే కంపెనీ తన షేర్లను వెనక్కి తీసుకోవడం. ఇందుకోసం ఇప్పటికే షేర్ హోల్డర్ల దగ్గర ఉన్న షేర్లపై అధిక ధర చెల్లించి కొనుగోలు చేస్తుందన్నమాట. ఇలా కూడా షేర్ హోల్డర్లకు లాభాల్ని అందిస్తుంటాయి. కంపెనీలు తమ లాభాల్ని షేర్ హోల్డర్లకు ఇలా డివిడెండ్, షేర్ బైబ్యాక్ వంటి ద్వారా పంచుకుంటుంటాయి.