ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 965మందికి ఈ పింఛన్లు మంజూరయ్యాయి. గతేడాది మార్చి తర్వాత కిడ్నీ, లివర్, గుండె, బోదకాలు, కుష్టు వంటి వ్యాధులతో బాధఫడుతున్నవారు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 965మంది దరఖాస్తు చేసుకోగా.. అందరికి పింఛన్లు వచ్చాయి. వీరికి జూన్ 1 నుంచి నెలకు రూ.10వేల చొప్పున ఇస్తారు. సామాజిక పింఛన్లు ఇచ్చినట్లుగా వీరికి స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయ సిబ్బంది పింఛన్లు పంపిణీ చేస్తారు. ఈ కొత్త పింఛన్లకు సంబంధించి నెలకు రూ.93.34 లక్షల వ్యయం కానుందని తేల్చారు. అంలేకాదు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ దరఖాస్తు చేసుకున్న వారికి ఏ నెలకు ఆ నెల వైద్యారోగ్యశాఖ ఆమోదం తర్వాత కొత్త పింఛన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం పక్షవాతంతో మంచానికి పరిమితైనవారు, కండరాల వ్యాధితో బాధపడేవారికి, తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా, తీవ్రమైన హీమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడేవారిని దివ్యాంగుల చట్టం పరిధిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీరికి కొత్తగా పింఛను మంజూరు చేయాలంటే సదరం సర్టిఫికెట్ సమర్పించాలి. అయితే పైన తెలిపిన వ్యాధులతో బాధపడుతున్నవారిలో.. 2025 మార్చి తర్వాత 1,217 మంది పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికి సదరం సర్టిఫికేట్ రాగానే.. ఆ మరుసటి నెల నుంచే పింఛన్ పంపిణీ చేయనున్నారు. వీరిలో కూడా పింఛన్లకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. తలసేమియా, హీమోఫీలియా, సికిల్‌సెల్ వ్యాధితో బాధపడే వారికినెలకు రూ.10వేల చొప్పున పింఛన్ ఇస్తారు. అదే పక్షవాతంతో మంచానికే పరిమితమైనవారితో పాటుగా తీవ్రమైన కండరాల వ్యాధితో బాధపడేవారికి నెలకు రూ.15వేల చొప్పున పింఛను పంపినీ చేయనున్నారు.. అర్హులైన వారు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది..సంబంధించి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించనుంది. త్వరలోనే కొత్త పింఛన్ల దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.