టీనేజ్ అమ్మాయి, అబ్బాయి ఇంటి నుంచి పారిపోతే ఆపగలమా?.. పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Wait 5 sec.

మైనర్లపై లైంగిక వేధింపులు, దోపిడీని అడ్డుకునే మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. కౌమారప్రాయంలో ఉన్న బాలికలు తమ భాగస్వాములతో పారిపోయినప్పుడు... తల్లిదండ్రులు తమ 'పరువు' కాపాడుకోవడానికి క్రిమినల్ చర్యలను ఒక ఆయుధంగా వాడుతున్నారని జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘ఒక అమ్మాయి, అబ్బాయి పారిపోవడాన్ని ప్రభుత్వం ఎలా నిరోధించగలదు? పోక్సో చట్టం అనేది పిల్లలపై లైంగిక దాడి, దోపిడీకి సంబంధించింది.. 15 నుంచి18 ఏళ్ల వయసు చాలా సున్నితమైంది.. ఆ వయసులో కొత్త విషయాలను ప్రయోగించి చూడాలని కుతూహలం ఉంటుంది.. అసలు ఇలాంటి కేసులు పోక్సో పరిధిలోకి వస్తాయా?’’ అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.కౌమారదశలో ఉన్నవారి గోప్యత హక్కుకు సంబంధించి ఓ సుమోటో కేసును సుప్రీంకోర్టు విచారించింది. నేపథ్యంలో ఈ కేసు మొదలైంది. ‘‘బాలికలు రెండు నిమిషాల లైంగిక సుఖం కోసం చూసుకుంటే సమాజం దృష్టిలో పరాజితులుగా మిగిలిపోతారని.. కౌమార ప్రాయంలో తమ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలి’’ అంటూ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును తర్వాత సుప్రీంకోర్టు పక్కనబెట్టింది.తాజాగా, ఆ కేసు ప్రస్తుత స్థితిని సీనియర్ లాయర్ మాధవి దివాన్ సుప్రీంకోర్టుకు వివరించారు. ‘‘25 ఏళ్ల యువకుడితో మైనర్ బాలిక వెళ్లిపోవడానికి సంబంధించిన కేసు... ఆ సమస్య ఇప్పుడు పరిష్కారమైంది. ఈ వ్యవహారం దాదాపు ముగిసింది. కోర్టు నియమించిన కమిటీ, సామాజిక కార్యకర్తలు ఆ బాలికతో మాట్లాడారు. పోక్సో కేసులలో వ్యవస్థ ఏ విధంగా విఫలమవుతోందనే దానిపై ఒక కీలక నివేదిక కూడా అందజేసింది’’ అని ఆయన తెలిపారు.పోక్సో చట్టం ప్రకారం మైనర్లకు కొన్ని పునరావాస చర్యలు పొందే హక్కు ఉందని దివాన్ పేర్కొన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తులు జోక్యం చేసుకుంటూ.. బాలిక ఇష్టపూర్వకంగా పారిపోయిందా? లేక కిడ్నాప్ కేసా? అని ప్రశ్నించారు. ఆ బాలిక సదరు యువకుడితో ఉండాలని కోరుకుందని, వారికి ఒక బిడ్డ కూడా ఉన్నాడని దివాన్ వివరించారు.ఈ సందర్భంగా పోక్సో చట్టం దుర్వినియోగంపై న్యాయమూర్తులు మాట్లాడుతూ... ‘‘16-18 ఏళ్ల వయసులో వారు ఒక బంధాన్ని ఏర్పరచుకుని వెళ్లిపోతున్నారు. తల్లిదండ్రులు తమ పరువును కాపాడుకోవడానికి వారిపై క్రిమినల్ కేసులు మోపుతున్నారు. మేము వారిని నిర్దోషులుగా విడుదల చేయాల్సి వస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. ఇలాంటి సమస్యలను నివారించడానికి ఒక బలమైన వ్యవస్థ అవసరమని దివాన్ అన్నారు. ‘‘ఆ అమ్మాయి ఇప్పటికే తన భర్తతో స్థిరపడి సంతోషంగా ఉంది. కౌమార ప్రాయంలో ఉన్నవారి సంక్షేమం, బాలల రక్షణ కోసం చర్యలు తీసుకోవడమే అసలైన సమస్య’’ అని ఆమె అన్నారు.17-18 ఏళ్ల వయసున్న వారిని జైలుకు పంపుతున్న కేసులను దివాన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘‘చిన్న వయసు నుంచే దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం సమగ్రమైన సూచనలు అందించింది. వాటిని తార్కిక ముగింపు తీసుకురావాలి’’ అని ఆమె పేర్కొన్నారు.ఇక, 2012లో సమ్మతి వయస్సును 16 నుంచి 18 ఏళ్లకు పెంచక ముందే టీనేజర్లలో ఇలాంటి సంబంధాలు ఉండేవని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘‘ఇది కేవలం 2012 తర్వాతే జరగడం లేదు.. బాల్య వివాహాల మాదిరిగా ఇది అంతకుముందే జరిగింది. వయస్సు 18 ఏళ్లుగా మారిందో అది చట్టవిరుద్ధం అవుతుంది’’ అని సుప్రీంకోర్టు తెలిపింది. ఇలాంటి కేసులలో తమ ఆదేశాలు ఆచరణాత్మకంగా ఉండాలని కూడా సూచించింది.కేంద్రం తరఫున హాజరైన లాయర్ వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ప్రభుత్వం చేసిన సిఫార్సులను అంగీకరిస్తే.. వాటికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయవచ్చని అన్నారు. ‘‘ఇందులో ఒకటి కౌమార విద్య (అడోలెసెంట్ ఎడ్యుకేషన్). 6వ తరగతి నుంచి పోక్సో చట్టంపై అవగాహనను క్రమపద్ధతిలో పాఠ్యాంశాల్లో చేర్చడం’’ అని చెప్పారు. పోక్సో చట్టం కింద నమోదైన కేసుల పర్యవేక్షణకు ఒక ప్రత్యేక డాష్‌బోర్డ్ ఉండాలని దివాన్ సూచించారు.అయితే, ప్రతి హైకోర్టులోనూ ఇప్పటికే బాలల హక్కుల కోసం ఒక కమిటీ ఉందని, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి పర్యవేక్షణ చేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. దీనిని కేంద్రమే పర్యవేక్షించాలనే ప్రతిపాదనతో కోర్టు ఏకీభవించలేదు. ఈ అంశంపై తదుపరి విచారణను జూలై 17కి వాయిదా వేసింది.