హైదరాబాద్‌లోనే రూ.6,843 కోట్లు.. అద్దెకు ఉన్నవారు ఇచ్చిన 'అడ్వాన్స్'.. దేశవ్యాప్తంగా ఎంతో ఊహించగలరా?

Wait 5 sec.

: సొంత ఇల్లు లేనివారు, తరుచూ ఉద్యోగ బదిలీ ఉండేవారికి అద్దె ఇల్లే దిక్కు. అద్దెకు దిగే సమయంలో ఇంటి రెంటుతో పాటు ఓనర్లకు సెక్యూరిటీ డిపాజిట్ (అడ్వాన్స్) చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా 2 నెలల నుంచి 10 నెలల రూపంలో తీసుకుంటుంటారు. కానీ, ఇది చర్చించుకోవాల్సిన అతి పెద్ద అంశమని ప్రముఖ రియల్ ఎస్టేట్ ప్లాట్ ఫామ్ నో బ్రోకర్ సంస్థ పేర్కొంటోంది. ఇంట్లో అద్దెకు దిగే ముందు ఇంటి ఓనర్లకు చెల్లించిన సొమ్ము దేశవ్యాప్తంగా ఏకంగా రూ.1.26 లక్షల కోట్లు ఉందని పేర్కొంది. ఈ మేరకు రెంట్ రిపోర్ట్ 2026కు విడుదల చేసింది. దేశంలోని 6 ప్రధాన మెట్రో నగరాల్లో అధ్యయనం చేసి ఈ రిపోర్ట్ విడుదల చేసింది. నెలవారీ అద్దె కంటే ముందస్తుగా చెల్లించే ఈ అడ్వాన్స్ పేమెంట్లే అద్దెదారులకు అతిపెద్ద సవాలుగా మారినట్లు నివేదిక అభిప్రాయపడింది. కొన్ని ప్రాంతాల్లో 6-10 నెలల అద్దె అడ్వాన్స్‌గా చెల్లించాల్సి రావడం గమనార్హం. చాలా మంది ఈ అడ్వాన్స్ చెల్లించలేకే తాము కోరుకున్న ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకోలేకపోతున్నారని పేర్కొంది. ఒక్క హైదరాబాద్‌లోనే రూ.6,843 కోట్లుఈ సిటీలో ఇంటి ఓనర్ల వద్ద పేరుకుపోయిన అడ్వాన్సుల సొమ్ము రూ.41,156 కోట్లుగా ఉన్నట్లు నో బ్రోకర్ నివేదిక తెలిపింది. ఆ తర్వాతి స్థానంలో బెంగళూరు ఉంది. ఈ సిటీలో సెక్యూరిటీ డిపాజిట్ల రూపంలో ఇంటి ఓనర్ల వద్ద రూ.31,628 కోట్లు పేరుకుపోయాయని తెలిపింది. ఇక మూడో స్థానంలో ఢిల్లీ నగరం ఉండగా ఇక్కడ రూ.24,056 కోట్లుగా అంచనా వేసింది. నాలుగో స్థానంలో చెన్నై నగరం ఉండగా ఇక్కడ రూ.17,346 కోట్లుగా అద్దె అడ్వాన్స్ సొమ్ము ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఐదో స్థానంలో హైదరాబాద్ నగరం నిలిచింది. భాగ్యనగరంలో ఇంటి ఓనర్ల వద్ద అద్దెదారుల అడ్వాన్స్ సొమ్ము రూ.6,843 కోట్లు ఉన్నట్లు తేల్చింది. ఇక ఆరో స్థానంలో పుణె నగరం ఉంది. ఇక్కడి యజమానుల వద్ద రూ.5,015 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది.మరి పరిష్కారం ఏంటి?ఈ అంశాన్ని అద్దె ఇల్లు, సెక్యూరిటీ డిపాజిట్ల కోణంలోనే చూడవద్దని నో బ్రోకర్ రిపోర్ట్ అభిప్రాయపడింది. ఈ లక్షల కోట్ల రూపాయల సొమ్ము ఓనర్ల వద్ద మూలుగుతోందని, మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఈక్విటీల వంటి పెట్టుబడి సాధానాలు, ఆర్థిక కార్యకలాపాల్లో గానీ నోచుకోవడం లేదని పేర్కొంది. రెంటల్ డిపాజిట్ కాకుండా ఇతర దేశాల తరహాలో రెంటల్ డిపాజిట్ బీమా లేదా బ్యాంక్ గ్యారెంటీ వంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉండేలా చూడాలని అభిప్రాయపడింది.