Wipro Q1 Results: భారతీయ ఐటీ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన విప్రో లిమిటెడ్ (wipro Ltd) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లోని మొదటి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. మార్కెట్ నిపుణుల అంచనాలకు అనుగుణంగానే విప్రో స్థిరమైన ప్రదర్శన కనబరించింది. ఏడాది ప్రాతిపదికన చూసుకుంటే కంపెనీ నికర లాభం స్వల్పంగా 1 శాతం వృద్ధి నమోదు చేసింది. తొలి త్రైమాసికంలో రూ.3,352 కోట్ల నికర లాభాన్ని అందుకున్నట్లు వెల్లడించింది. గత ఏడాది ఇదే పోలిస్తే 1 శాతం మాత్రమే పెరిగింది. షేర్ హోల్డర్లకు శుభవార్తఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో లాభాలు నమోదు చేసిన క్రమంలో తమ షేర్ హోల్డర్లకు శుభవార్త చెప్పింది. ఈ కంపెనీలో షేర్లు ఉన్నవారికి డివిడెండ్ చెల్లిస్తామని తెలిపింది. ఒక్కో షేరుకు రూ.2 చొప్పున మధ్యంతర డివిడెండ్ ఖరారు చేసింది. ఈ డివిడెండ్ చెల్లించేందుకు కంపెనీ బోర్డ్ ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. 11 శాతం పెరిగిన ఆదాయంఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన విప్రో ఆదాయం 11 శాతం మేర పెరిగి రూ.24,479 కోట్లుగా నమోదు చేసినట్లు తెలిపింది. అంతకు ముందు ఏడాది ఇదే తొలి త్రైమాసికంలో కంపెనీ ఆపరేషన్స్ రెవెన్యూ రూ.22,135 కోట్లుగా ఉంది. ఈ క్రమంలో సెప్టెంబర్ త్రైమాసికానికి గానూ ఆచితూచి వ్యవహరించాల్సి అవసరం ఉందని పేర్కొంది. ఐటీ సర్వీసెస్ రెవెన్యూ 1.5 శాతం మేర తగ్గవచ్చని అంచనా వేసింది. కాన్‌స్టెంట్ కరెన్సీ 0.5 శాతం పెరగవచ్చని తెలిపింది. ఇక కంపెనీ కోర్ ఐటీ సర్వీసెస్ బిజినెస్ 2.61 బిలియన్ డాలర్ల రెవెన్యూ సాధించినట్లు తెలిపింది. అయితే, ఏడాది క్రితం రెవెన్యూతో పోలిస్తే 1 శాతం పెరిగినా త్రైమాసిక ప్రాతిపదినక చూస్తే 1.4 శాతం పడిపోయిందని తెలిపింది. ఇక స్థిర కరెన్సీ పద్దతిలో ఐటీ సర్వీసెస్ రెవెన్యూ క్యూ టూ క్యూ పద్ధతిలో 1.2 శాతం మేర తగ్గిందని, ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన 0.9 శాతం పెరిగిందని వెల్లడించింది. స్వల్ప లాభాల్లో విప్రో షేరు విప్రో షేరు స్వల్ప లాభాల్లో ముగిసింది. ఇంట్రాడేలో రూ.175.60 వద్ద ట్రేడింగ్ మొదలు పెట్టగా ఒక దశలో 3.210 శాతం లాభంతో రూ. 177.99 వద్ద గరిష్ఠాన్ని తాకగా చివరకు 3.05 శాతం లాభంతో రూ.177.70 వద్ద స్థిరపడింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.273.10 వద్ద ఉండగా కనిష్ఠ ధర రూ.169 వద్ద ఉంది.